1 రూపాయికే భోజనం.. రోజూ వేలమందికి  - MicTv.in - Telugu News
mictv telugu

1 రూపాయికే భోజనం.. రోజూ వేలమందికి 

October 27, 2020

ఈ ప్రపంచంలో ఒక రూపాయికి ఏమొస్తుంది? కనీసం సరైన చాక్లెట్ కూడా రాదు. కానీ ఓ చోట ఒక రూపాయికి ఏకంగా చక్కని భోజనమే వస్తోంది. అలాంటి ఇలాంటి భోజనం కాదు, అన్ని వంటకాలూ ఉన్న పసందైన భోజనం. చపాతీలు, పప్పు, సోయా పలావ్, పులుసు, పెరుగు, పచ్చడి, స్వీటు అన్నీ ఉంటాయి. కానీ ధరమాత్రం సింగిల్ రూపీనే. కేవలం ఒకే ఒక్క రూపాయిని నామమాత్రంగా తీసుకుని కడుపు నింపుతున్న ఆ హోటల్ దేశ రాజధాని ఢిల్లీలో ఉంది.