Shyam Singha Roy Sent To Oscar Nominations
mictv telugu

ఆస్కార్ బరిలో నాని ‘శ్యామ్ సింగరాయ్’

August 17, 2022

నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ కూడా ఆస్కార్ బరిలో నిలువనుంది. పునర్జన్మ, దేవదాసీల జీవన విధానం.. వంటి అంశాలతో రూపొందిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమా కోసం నాని పూర్తిగా తన గెటప్‌ను కూడా మార్చేశాడు. ఇక ఇందులో సాయి పల్లవి నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు రాహుల్ సంకిృత్యాన్ ఈ చిత్రాన్ని చాలా క్రియేటివ్‌గా తెరకెక్కించాడు.

తాజాగా ఈ సినిమాను భారతదేశం తరఫున 3 మూడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌కు పంపించినట్లు చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు. పీరియాడిక్ డ్రామా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డాన్స్.. ఇలా మొత్తం మూడు విభాగాల్లో ఈ సినిమాను నామినేషన్ పంపించినట్లు తెలిపారు. శ్యామ్ సింగ రాయ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా రూ. 19.67 కోట్లు షేర్ (రూ. 33.50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా రూ. 50 కోట్లతో నిర్మించారు. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో అలరించారు.

ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్ నిలవబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆస్కార్ పోటీలో నిలిచే నటుల పేర్లతో ‘వైరెటీ’ మ్యాగజైన్ ప్రిడిక్షన్ లిస్ట్‌ను వెల్లడించింది. ఇందులో ఉత్తమ నటుడి క్యాటగిరీలో తారక్ పేరు కూడా ఉంది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఆస్కార్ 2023 బరిలో ఎన్టీఆర్ కచ్చితంగా ఉంటారంటూ సంబరాలు చేసుకుంటున్నారు.