మాకు జాబులివ్వకపోతే అన్నల్లో చేరిపోతాం : మోడీకి రక్తంతో లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

మాకు జాబులివ్వకపోతే అన్నల్లో చేరిపోతాం : మోడీకి రక్తంతో లేఖ

May 17, 2022

కర్ణాటక పోలీస్ ఎస్ఐ రిక్రూట్ మెంట్‌లో అక్రమాలు జరిగాయన్న కారణంతో మొత్తం నియామకాలను రద్దు చేయడంపై అభ్యర్ధులు మండిపడుతున్నారు. కొద్ది నెలల క్రితం 545 ఎస్ఐ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో అక్రమాలు జరిగాయని మొత్తం నియామక ప్రక్రియను అధికారులు రద్దు చేశారు. ఇందులో మంత్రుల స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో విమర్శలకు భయపడిన ప్రభుత్వం మొత్తం ప్రక్రియను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో పోస్టులకు ఎంపికైన వారు ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వంతో న్యాయం జరగదని భావించి ఏకంగా ప్రధాని మోదీకి తమ రక్తంలో ఓ లేఖ రాశారు. అందులో ‘తాము ఎనిమిది మందిమి ఉన్నాం. తమకు న్యాయం చేయకుంటే మావోయిస్టు పోరాటంలో చేయి కలుపుతాం’ అని రాసి ఉంది. కాగా, ఈ లేఖ నిజమైందా లేదా వేరే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా అనే దిశగా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.