SI, constable suspended after rowdy sheeter ‘celebrates’ birthday at Eluru police station
mictv telugu

రౌడీ షీటర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్

June 20, 2022

 

SI, constable suspended after rowdy sheeter ‘celebrates’ birthday at Eluru police station

ఏపీలో అధికార పార్టీకి చెందిన ఓ కార్పోరేటర్ భర్త.. పోలీస్ స్టేషన్‌లోనే హంగామా సృష్టించాడు. రౌడీ షీటర్‌గా స్టేషన్‌కు కౌన్సిలింగ్ కోసం వచ్చిన అతగాడు.. పీఎస్ ప్రాంగణంలోనే తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సంబంధిత పోలీసులపై వేటు పడింది. ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రతి నెలా రౌడీ షీటర్ లను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఇదే క్రమంలో ఈ నెల 18వ తేదీ సాయంత్రం కూడా రౌడీషీటర్లు స్టేషన్ కు వచ్చారు. వారిలో వైసీపీ కార్పొరేటర్ భర్త భీమవరపు హేమసుందర్ ఉన్నారు.

హేమసుందర్ తో పాటు వచ్చిన మిగతా రౌడీ షీటర్లు.. వినూత్నంగా పుట్టిన రోజును స్టేషన్ లో జరపాలనుకున్నారు. పోలీసులు ఎవరి హడావుడిలో వారు ఉండగా అప్పటికప్పుడు కేకులు తెప్పించిన ఆ రౌడీలు స్టేషన్ ప్రాంగణంలోనే హేమ సుందర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేరింతలు కొడుతూ, ఈలలు వేస్తూ నానా రచ్చ చేశారు. ఈ వ్యవహారంపై డీఐజీ పాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎస్సై కిషోర్ బాబు, కానిస్టేబుల్ రాజేష్ లను సస్పెండ్ చేయడంతో పాటు సీఐ రమణకు ఛార్జ్ మెమో జారీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టారు.