Home > Featured > ఎస్‌ఐ పరీక్ష రాసి.. తమ్ముడి పెళ్లికి వెళ్తూ మృత్యుఒడిలోకి..

ఎస్‌ఐ పరీక్ష రాసి.. తమ్ముడి పెళ్లికి వెళ్తూ మృత్యుఒడిలోకి..

ఎస్ఐ కావాలన్న అతని కల మృత్యువు రూపంలో కబళించింది. ఈరోజు జరిగిన ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షకు హాజరై.. ఆ తర్వాత తమ్ముడి పెళ్లికి వెళ్తూ అనంతలోకాలకు చేరాడు ఓ యువకుడు. ఈ విషాదకర ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంజనేయులు అనే యువకుడు దుందిగల్ మర్రి లక్ష్మా రెడ్డి కళాశాలలో పరీక్ష రాసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన పల్సర్ వాహనం పై షాపూర్ నగర్ వైపు వస్తున్నాడు. వెనక నుంచి వచ్చిన లారీ ట్యాంకర్ ఢీకొట్టడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మృతుడు ఆంజనేయులు తమ్ముడి పెళ్లి ఈరోజు నిజామాబాద్ లో జరగనుంది. దీంతో పరీక్ష రాసిన అనంతరం.. ద్విచక్ర నిజామాబాద్‌కు వాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటన పెళ్లి ఇంట తీరని విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Updated : 7 Aug 2022 6:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top