రెండు ఆత్మ‌హ‌త్య‌లు...వందల డౌట్లు. - MicTv.in - Telugu News
mictv telugu

రెండు ఆత్మ‌హ‌త్య‌లు…వందల డౌట్లు.

June 15, 2017

రెండు ఆత్మ‌హ‌త్య‌లు…వందల డౌట్లు…ఆమె బ్యూటీషియన్.. అతను ఎస్సై. ఆమె ఉండేది హైదరాబాద్ లో ..అతను డ్యూటీ చేసేది కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో. మరి లింకు ఎలా కుదిరింది. ఇద్దరూ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదని వారి వారి బంధువులు చెబుతున్నారు. ఇంతకీ వీళ్లది ఆత్మహత్యా, హత్యా..?మరి ఏం జరిగింది..ఎలా జరిగింది? ఈ రెండు కేసుల వెనుక మిస్టరీ ఏంది..?

సిద్ధిపేట జిల్లా కకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో ఉండే బ్యూటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతి ఘటనకు ఎస్‌ఐకి లింకు ఉన్నట్లు తాజాగా బయటపడింది. మద్యం మత్తులో శిరీషపై ప్రభాకర్‌ రెడ్డి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కొంతకాలంగా ప్రభాకర్‌రెడ్డికి శిరీష పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో ఎస్‌ఐ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు.

ఎవరీ శిరీష…

పశ్చిమగోదావరి జిల్లా మట్టపర్తివారిపాలేనికి చెందిన సతీష్‌చంద్రతో శిరీషకి 2004లో పెళ్లైంది. ఉపాధి కోసం 2007లో హైదరాబాద్‌కు వచ్చారు. సతీష్‌చంద్ర ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా శిరీష బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకుని శిక్షకురాలిగా మారింది. షేక్‌పేట ప్రధాన రహదారిలోని ఆర్‌.జె.ఫోటోస్టుడియో యజమాని రాజీవ్‌తో పెళ్లిళ్లు, ఇతర వేడుకలప్పుడు పెళ్లికూతురు అలంకరణ చేస్తానంటూ నాలుగేళ్ల కిందట ఒప్పందం కుదుర్చుకుంది. రాజీవ్‌ పెళ్లి ఫోటోలు, వీడియోలు తీస్తే శిరీష పెళ్లికూతురికి అలంకరణ చేసేది. బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నది. మంగళవారం ఉదయం ఆమె తన ఆఫీసులో మృతదేహమై కనిపించింది.

అన్నీ అనుమానాలే…

శిరీష మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు కంప్లయింట్ చేశాడు. .

ఈ ఘటనకు ముందు శిరీష, రాజీవ్‌, అతని స్నేహితుడు శ్రావణ్‌ బయటకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరు ముగ్గురు కలిసి మద్యం సేవించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో శిరీషది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్‌జే వల్లభనేని రాజీవ్‌ను ప్రశ్నించగా రాత్రి రెండుగంటల ప్రాంతంలో శిరీష ఫ్యాన్‌కు ఉరేసుకుందని తానే చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని చెప్పాడట. రెండోసారి విచారించగా బాత్రూంలో ఆత్మహత్య చేసుకుందని చెబుతుండటంతో అనుమానాలు బలపడుతున్నాయి. అలాగే రాజీవ్‌తో పాటు అతడి స్నేహితుడు శ్రావణ్ ని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై అన్నీ అనుమానాలే…

ఎస్ ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. బంజారాహిల్స్‌లో మంగళవారం జరిగిన బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్యే ప్రభాకర్‌రెడ్డి బలవన్మరణానికి కారణమై ఉండొచ్చన్న వాదన అనూహ్యంగా తెరపైకి వచ్చింది. శిరీష చనిపోయిన మర్నాడే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోసుకోవడమే ఈ డౌట్స్ కు కారణం. తొలుత రెండూ వేర్వేరు సంఘటనలుగానే భావించిన పోలీసులకు చిన్న ఆధారం లభించడం, ప్రాథమిక సాక్ష్యాలతో పరిశోధనను కొనసాగించడంతో రెండింటి లింకు ఉందన్న అనుమానం తలెత్తింది. ఇందుకు సంబంధించి మరిన్ని సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని హైదరాబాద్‌ పశ్చిమ మండల డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు చెప్పారు. రాజీవ్‌ ఫోన్‌కాల్స్‌ను విశ్లేషించగా శ్రవణ్‌, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌ నంబర్లు కనిపించాయి. శ్రవణ్‌ను విచారించగా జరిగిన విషయమంతా చెప్పేశాడు. ఈ విషయం ప్రభాకర్‌రెడ్డికి తెలిసిందని, ఒకపక్క శిరీష ఆత్మహత్య, మరోపక్క రాజీవ్‌, శ్రవణ్‌లు పోలీసు అదుపులో ఉండటంతో ప్రభాకర్‌రెడ్డి ఆందోళన చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. తన పేరు ఎక్కడ బయటకు వస్తుందో అన్న ఆందోళనతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

హత్యా..ఆత్మహత్యా…?

ఇక సోషల్ మీడియాలో ఎస్సై ఘటనపై టన్నులకొద్ది డౌట్స్ పోస్ట్ అవుతున్నాయి. తెలంగాణ పోలీస్ శ్రీనివాస్ లెవనెత్తిన ప్రశ్నల్ని యాజ్ టీజ్ గా ఇక్కడ ఉంచుతున్నాం…

1)ఒక మనిషి sitting position లో కాల్చుకొని ఉంటే ఏ పాయింట్ బ్లాక్ లో weapon తో కాల్చుకుంటే తన opposite direction లో పడిపోవాలి.

2)తను ఎడమ కనతికి కాల్చుకుండు అంటే బుల్లెట్ కుడి కనత నుండి బయటికి వెళ్లి అక్కడ దగ్గరలో ఉన్న గోడకు తగలాలి.

3)25 yads రేంజ్ ఉన్న పిస్టల్ తో అది పాయింట్ బ్లాక్ లో కాల్చుకుంటే కాల్చుకున్న వ్యక్తి కచ్చితంగా ఆ ప్లాస్టిక్ కుర్చీలో నుండి 100% పక్కకు పడి పోవాలి.

4)ఎడమ కనతికి కాల్చుకుంటే రక్తం కచ్చితంగా తన opposit లో పడి పోవాలి.ఇక్కడ back side ఎలా పడుతుంది.

5)తన కుడి చేతికి గాయం ఎందుకు అయ్యింది..రక్తం మరకలు బట్టలంతటికి అంటుడు విచిత్రమే,అనుమానమే.

6)ఎడమ చేతితో లేదా కుడి చేతితో కాల్చుకుంటే weapon అతడికి ఉన్న బలం తో అతడికి తెలియకుండానే చాలా దూరం లేదా opposite లో తన దగ్గర్లో పడి పోవాలి..కానీ అది తన కాల కింద అది ఎడమ కాలి వెనుకాల ఎవరో పెట్టినట్లు ఉంది..

7)కుర్చీలో చనిపోయిన వ్యక్తి అంత బిగుసుగా కూర్చొని ఉండడు. అది అతి గ్యాస్ ఒత్తిడితో కూడిన wepon తో కాల్చుకుంటే…
ఈ కేసును తప్పుదారి పట్టనికి మీడియా సంస్థలు,పోలీస్ కొంత మంది ఉన్నత అధికారులు ఆడుతున్న నాటకం.

ఇగ శిరీష్ విషయానికి వస్తే అది కావాలనే చేసి ఉండొచ్చుగా. పోని వాళ్ళిద్దరి ఫోటోలు ఏమైనా దొరికినాయ.కచ్చితంగా ఇది professional చేసిన హత్య..ఈ కోణంలో దర్యాప్తు ఎందుకు చేపడతాలేదు…సరే శిరీష్ ఆత్మ హత్య కేస్ లో ఆమె సూసైడ్ నోట్ లో ప్రభాకర్ రెడ్డి పేరు గాని అతడి ప్రియుడి పేరు గాని ఉందా?అసలు ప్రభాకర్ సర్ ని ఎందుకు చంపాలనుకున్నారు? ఇలా పలు డౌట్లను పోలీస్ ఆఫీసర్స్ ముందు ఉంచాడు.
మరో కోణం..

ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య గురించి తెలియగానే కుకునూర్‌పల్లితోపాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పోలీసుస్టేషన్‌ దగ్గరకు తరలివచ్చారు. గతేడాది ఆగస్టు 16న అప్పటి కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి కూడా ఉన్నతాధికారులు వేధిస్తున్నారని లేఖ రాసి ప్రస్తుత సంఘటనాస్థలంలోనే తుపాకీతో కాల్చుకుని మృతి చెందాడు. పది నెలల వ్యవధిలోనే ఇద్దరు ఎస్సైలు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఉన్నతాధికారుల వేధింపులే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో ఎంతవరకు నిజం. నాయిని సర్ ఇక ఊరుకోవద్దు..జర విచారణ జరిపిస్తే అసలు నిజాలెంటో తెలుస్తాయి…

నా భర్త చనిపోయేంత పిరికివాడు కాదు…

నా భర్త చనిపోయేంత పిరికివాడు కాదు. ఏసీపీ సార్‌ డబ్బుల విషయంలో వేధిస్తున్నట్లు పలుమార్లు నాతో చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే హత్య చేసి ఉంటారు. అవినీతికి దూరంగా ఉండే వ్యక్తి ప్రాణాలను అన్యాయంగా ఉన్నతాధికారులే తీశారు. నన్ను, నా బిడ్డను ఆగం చేశారు. ఈ ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉంది..?

ఘటనకు ముందు అసలేం జరిగింది..?ఎవరీ తేజస్విని

రాజీవ్‌కు కొద్ది నెలల క్రితం మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇటీవల పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో శిరీష రోజూ స్టూడియోకు రావడం, రాజీవ్‌తో చనువుగా మాట్లాతుండటంతో ఆ అమ్మాయికి వీరిద్దరిపై అనుమానం వచ్చింది. ఎందుకు సన్నిహితంగా ఉంటావంటూ శిరీషను నిలదీసింది. ఆ తర్వాత కూడా ఇద్దరు కలిసే ఉండడంతో 100 నెంబర్‌కు ఫోన్‌ చేసి శిరీష అనే యువతి తనను వేధిస్తోందని చెప్పింది. వారు బంజారాహిల్స్‌ ఠాణాకు వెళ్లమన్నారు. వీరు ముగ్గురు బంజారాహిల్స్‌ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా మళ్లీ ఆ అమ్మాయితో గొడవపడటంతో శిరీష, రాజీవ్‌ల స్నేహితుడు నల్గొండ జిల్లాకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి శ్రవణ్‌ తెరపైకి వచ్చాడు. తనకు కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తెలుసని సమస్యను ఆయన పరిష్కరిస్తాడని చెప్పాడు. వివాదం పరిష్కరించాలని శ్రవణ్‌ కోరగా జూన్‌ 12న రావాలని ప్రభాకర్‌రెడ్డి చెప్పాడు. దీంతో రాజీవ్‌, శిరీష, శ్రవణ్‌లు రాత్రి 8 గంటల ప్రాంతంలో కారులో కుకునూర్‌పల్లికి వెళ్లారు. వెళ్లే ముందు శిరీష తన భర్తకు ఫోన్‌ చేసి రాత్రి ఆలస్యమవుతుందని చెప్పింది. దారిలో రెండు మద్యం సీసాలు కొనుక్కుని నేరుగా కుకునూర్‌పల్లి వెళ్లారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో అర్ధరాత్రి రెండు గంటల వరకూ నలుగురూ మద్యం తాగారు. ఆ తర్వాత ప్రభాకర్‌రెడ్డి రాజీవ్‌, శిరీషలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాడు. తేజస్వినితో మాట్లాడతానని అనడంతో శిరీష ఆగ్రహంతో ఇక్కడి నుంచి వెళ్లిపోతానని చెప్పింది. ఇది అధికారిక నివాసమని శాంతించాలని ఎస్సై చెప్పినా వినలేదు. దీంతో రాజీవ్‌ ఆమెను కొట్టడంతో.. గొడవ పెద్దదయ్యేలా ఉందని ఎస్సై ముగ్గురిని హైదరాబాద్‌ వెళ్లిపోమన్నాడు. శ్రవణ్‌, శిరీష, రాజీవ్‌లు కారులో హైదరాబాద్‌లోని స్టూడియో దగ్గరకు తిరిగివచ్చారు. అప్పటికి సమయం మంగళవారం తెల్లవారుజామున 3.40 గంటలయ్యింది. కారు పార్కింగ్‌ చేస్తుండగానే శిరీష కారులోంచి దిగి నేరుగా స్టూడియోలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆ తర్వాత శవమై కనిపించింది. ఇదంతా అనుమానాస్పదంగా ఉంది.

స్థానికుల రణజ్వాల…

మరోవైపు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఏడాది తిరక్కుండానే ఇద్దరు ఎస్సైలు మృతి చెందారని వారు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సుమారు మూడు గంటలపాటు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. ఓ మీడియా వాహనానికీ నిప్పంటించారు. దీంతో రహదారికి ఇరువైపులా సుమారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శవపరీక్ష, పంచనామాకు తీసుకెళ్లకుండా స్థానికులు అడ్డుకోవడంతో జిల్లాలోని పలు స్టేషన్ల నుంచి పెద్దఎత్తున పోలీసు బలగాలను రప్పించి ఎట్టకేలకు రాత్రి 9.30 గంటల సమయంలో మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో మృతుడి తల్లి రమణమ్మ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఆమెకు మద్దతుగా పలువురు కూర్చున్నారు. పోలీసులు వారిని వ్యాన్‌లో ఎక్కించే సమయంలో తొక్కిసలాట జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు వ్యాన్‌ అద్దాలను పగలగొట్టారు. ఆ తర్వాత గురువారం ఉదయం ఐదున్నర గంటలకు పోస్ట్ మార్టం పూర్తయింది. ఆతర్వాత స్వగ్రామం ఆలేరు కు ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి భౌతికకాయాన్ని తరలించారు.

సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత ప్రభాకర్ రెడ్డి, శిరీష్ లింకులపై స్పష్టమైన వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక పోలీసుల అదుపులో రాజీవ్ నోరు విప్పితేనే అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది.