Home > విద్య & ఉద్యోగాలు > ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల.. అందరికీ 8 మార్కులు ఉచితం

ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల.. అందరికీ 8 మార్కులు ఉచితం

తెలంగాణలో ఈ నెల 7న నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఆన్సర్ కీని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ కీ పేపరుని TSLPRB వెబ్‌సైటులో అందుబాటులో ఉంచింది. ఈ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్ధులు సోమవారం సాయంత్రం 5 గంటలలోపు తెలపాలని సూచించింది. ఈ అవకాశాన్ని కూడా వెబ్‌సైట్‌లో కల్పించింది. అభ్యర్ధులు పూర్తి వివరాలను https://www.tslprb.in/ ద్వారా తెలుసుకోవచ్చు. అటు పరీక్షా పత్రంలో జరిగిన పొరపాట్ల కారణంగా అందరికీ 8 మార్కులు ఉచితంగా ఇస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహించగా, 60 మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించారు. కాగా, మొత్తం 554 పోస్టులకు గాను 2,47,217 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 446 మంది పోటీపడుతున్నారు. అటు ఆగస్టు 21న జరగాల్సిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష వాయిదా పడడం తెలిసిందే. పరిపాలనా సమస్యల కారణంగా ఈ పరీక్షను ఈ నెల 28కి వాయిదా వేశారు. దీనికి సంబంధించిన హాల్ టిక్కెట్లను ఆగస్టు 18 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నియామక మండలి చైర్మెన్ తెలిపారు. మొత్తం 9.50 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా, హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Updated : 12 Aug 2022 10:03 PM GMT
Tags:    
Next Story
Share it
Top