మానవత్వాన్ని మురిపించిన రక్షకభటుడు ! - MicTv.in - Telugu News
mictv telugu

మానవత్వాన్ని మురిపించిన రక్షకభటుడు !

July 20, 2017

పోలీస్ ను తెలుగులో నిర్వచించుకుంటే ‘ రక్షక భటుడు ’ అంటాము. శ్రీకాకుళంలోని ఈ పోలీస్ ఎస్ ఐ నిజంగానే ఒక మహిళ ప్రాణాలు కాపాడి రక్షకభటుడు అనిపించుకున్నాడు. ఇంతకీ ఈ మానవత్వం మురిసిపోయే సంఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారూ.. శ్రాకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. టెక్కలి పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న రాజేష్ తన ప్రాణాలకు తెగించి ఒక మహిళను కాపాడాడు. ఆత్మహత్య చేస్కుందామని బావిలో దూకిన మహిళను చూసి వెంటనే తను కూడా బావిలోకి దూకి సుమారు అరగంటకు పైగా ఆమెను బావిలో ప్రాణాలతో పట్టుకొని స్థానికులు బైటకు తీసే ఏర్పాట్లు చేసేవరకు లోపల ఆమె మునిగిపోకుండా అలాగే పట్టుకొని కాపాడాడు.

నిజంగా చాలా గ్రేట్ కదా ఇలాంటి పోలీస్ అధికారులకు మనస్ఫూర్తిగా సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. పోలీస్ అంటే అన్యాయాలను, అక్రమాలను నివారించేవాడు మాత్రమే కాదు ఆపదలో వున్నవాళ్ళను కూడా కాపాడి మానవత్వాన్ని బతికించేవాడని, రక్షణ లేని వారికి పూర్తి రక్షణగా కూడా నిలబడేవాడని నిరూపించాడు ఎస్ ఐ రాజేష్. అతనికి దిల్ తో హ్యాట్సాఫ్ చెబుదామా !