ఎస్సైల మరణాలు...అంతుచిక్కని ప్రశ్నలు..ఆ పాపం ఎవరిది ? - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్సైల మరణాలు…అంతుచిక్కని ప్రశ్నలు..ఆ పాపం ఎవరిది ?

June 14, 2017

పగలు రాత్రి అని తేడాలేకుండా పనిచేస్తూ ప్రజల మాన ప్రాణాలను కాపాడుతూ వారికి ఏ ప్రాబ్లం వచ్చినా రక్షణగా నిలిచిన వాళ్లు..ఆ ధైర్యాన్ని ఎందకు కోల్పోతున్నారు ? తమకు ప్రభుత్వం ఇచ్చిన తుపాకీతో కాల్చుకుని.. జీవిడిస్తున్నరు ఎందుకు? రాను రాను వాళ్ల గుండె ధైర్యం నీరు గారిపోతుందా? వాళ్ల మనోస్థైర్యాన్ని కోల్పోవడానికి కారణం ఎవరు?

ఒకే పోలీస్ స్టేషన్..ఇద్దరు ఎస్సైల ఆత్మహత్యలు

సిద్దిపేటజిల్లా కుకునూర్ పల్లిలో పోయిన సంవత్సరం ఆగస్టులో రామకృష్టారెడ్డి అనే ఎస్సై తన రివాల్వర్ తో  కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు,సంఘటనా స‌్థలంలో దొరికిన సూసైడ్ ప్రకారం ఉన్నత అధికారుల ఒత్తిడి వల్లే తను బలవన్మరణానికి పాల్పడుతున్నాని రాసివుంది,కానీ అధికారులు వినిపించిన వాదనలు మరోలా ఉన్నాయి. ఇపుడు అదే పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రెడ్డి అనే మరో ఎస్సై కూడా తన రివాల్వర్ తో కాల్చుకొని జీవిదీస్కుండు,దీనికి కూడా భిన్న ఆరోపణలు వినిసిస్తున్నాయి.

కరీంనగర్ జిల్లాలో కూడా ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు..2007బ్యాచ్ కి చెందిన పెద్దపల్లి ఎస్సై జగన్‌మోహన్ తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని జీవిదీస్కుండు, స్ధానిక నేతలతో పాటు, ఉన్నతాధికారుల వేధింపులు కారణమని ఓ లెటర్ని జగన్ సుసైడ్ లెటర్ రాయడం అప్పట్లో సంచలనమైంది.. రాజేంద్రనగర్ లోని ఉప్పర్ పల్లి చెందిన ఎస్సై  శ్రీధర్ కూడా తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.శివరాంపల్లిలోని ఎన్పీఏలో లో ప్రధాని సమక్షంలో జరుగుతున్న డీజీపీల సదస్సు జరుగుతున్న టైమ్ లో బందోబస్తులో ఉన్న శ్రీదర్ ఆత్మహత్య చేసుకోడం ఆందోళనకి గురిచేసే అంశంగా మారింది.. రంగారెడ్డి జిల్లా యాలా ఎస్సై రమేష్ కూడా పోలీసు అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం రేపింది. అయితే యాలాలలో ఇసుక మాపియా దందా ఎక్కువగా జరుగుతోంది. ఈ దందాలో ఎవరి వాటాలు వారికి వెళ్తుంటాయి. ఇసుక మాపియా విషయంలో పోలీసు ఉన్నతధికారులు చూసిచూడన్నట్లు వ్యవహరించేవారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే యాలాలో ఎస్సైగా బాద్యతలు చేపట్టిన రమేష్… ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు. దీంతో ఎస్సై రమేష్.. తమ మాట వినకపోవడంతో టార్గేట్ చేశారు. సీఐ, డీఎస్పీ వేధింపుల వల్లనే ఎస్సై రమేష్ ఆత్యహత్య చేసుకున్నాడని.. అతడి కుటుంబ సభ్యలు ఆరోపించారు.

సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఎస్‌ఐ చిట్టిబాబు తన సర్వీస్‌ రివాల్వర్‌ తో భార్యను కాల్చి, తాను కూడా కాల్చుకున్నాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, చిట్టిబాబు ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మరణించాడు..ఉన్నతాధికారుల వేధింపులవల్లే ఎస్ ఐ చిట్టిబాబు ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి,ఈ విషయంపై ఉన్నతాధికారుల వర్షన్ మరోలా వినిపించారు.అవినీతి ఆరోపణల వల్లే చిట్టిబాబుని సిద్దిపేట డీఎస్పీ ఆఫీసుకి అటాచ్ చేయడంతో పాటు..ఆతర్వాత చిట్టిబాబుని సస్పెండ్ చేసినట్టు చెప్పారు.

సీఐ నుంచి డీఎస్పీ, ఏ ఎస్ స్పీ, ఎస్పీ లాంటి అధికారులు…. తమ మాట వినకుంటే… వేధింపులకు పాల్పడుతుండడంతో ఎస్సైలు సూసైడ్స్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి, కొత్తగా పోలీసు శాఖలోకి ఎంటరైనా ఎస్సైలు… విధుల పట్ల కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తారు. అయితే సీఐలు, డీఎస్పీలు లక్షలు రూపాయలు ఇచ్చి నచ్చిన చోట పోస్టింగ్ లు తెచ్చుకుంటున్నారు. లోకల్ గా జరిగే కొన్ని ఇల్లీగల్ అక్టివిటీపైన దృష్టి పెట్టి డబ్బులు వసూల్ చేసి పెట్టాలని సీఐలు, డీఎస్పీ స్థాయి అధికారులు… ఎస్సైలపై ఒత్తిడి పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కొన్ని విషయాలలో చూసిచూడనట్లు ఉండాలని ఎస్సైలకు హుక్కుం జారీ చేస్తున్నారు. దీంతో ఎస్సైలు…. పై అధికారి మాట వినపోతే.. అంతే సంగతలు.. ఎస్సైలను టార్గేట్ చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఎస్సైలు ఆత్మహత్య చేసుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి…ఏది ఏమైనా వరుసగా ఇలా ఎస్సైల మరణాలవల్ల అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో…ఈ పాపం ఎవరిదో ఆదేవుడికే తెలియాలి.