Home > Featured > పెళ్లికావడం లేదన్న పోలీస్ మళ్లీ విధుల్లోకి..రాజీనామా తర్వాత ఏం చేశాడంటే…

పెళ్లికావడం లేదన్న పోలీస్ మళ్లీ విధుల్లోకి..రాజీనామా తర్వాత ఏం చేశాడంటే…

,fnbt

పెద్ద చదువులు చదివి చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు పెళ్లిళ్లు కావడం లేదు అనడానికి హైదరాబాద్ కి చెందిన సిద్ధాంతి ప్రతాప్ ఉదంతం ఓ చక్కటి ఉదాహరణ. ఇంజనీరింగ్ పాస్ అయిన ప్రతాప్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం తెచ్చుకున్నాడు. దీంతో అతడికి అమ్మాయిని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ప్రతాప్ గత ఏడాది హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు లేఖ రాసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ విషయం అప్పట్లో సంచలనమైంది. అతడి జీవన్మరణ సమస్యను అర్థం చేసుకున్న సీపీ అంజనీకుమార్ అతడి రాజీనామాను ఆమోదించారు. తాజాగా సిద్ధాంతి ప్రతాప్ మళ్ళీ ఉద్యోగంలో చేరాడు.

పోలీస్ గా పనిచేస్తున్న రోజుల్లో ప్రతాప్ పెళ్లి సంబంధాల వెతకడం మొదలుపెడితే.. ఇంజనీరింగ్ చదివి కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడా? అని అమ్మాయిల తలిదండ్రులు అడిగేవారు. ఇలా ఎందరో తల్లిదండ్రులు ప్రతాప్ కు పిల్లను ఇవ్వడానికి వెనక్కి తగ్గారు. దీంతో ప్రతాప్ పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తరువాత బిజినెస్‌ ప్రయత్నాలు చేశాడు. అయినా కూడా పెళ్లి కావడంలేదు. దీంతో మళ్లీ తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరాడు. దీనికి పోలీస్ అధికారులు ఓకే చెప్పారు. దీంతో ప్రతాప్ మళ్లీ విధుల్లో చేరాడు. ప్రస్తుతం డీపీజీ ఆఫీసులో కంప్యూటర్‌ విభాగంలో అతడు చేస్తున్నాడు.

Updated : 14 May 2020 6:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top