Home > Featured > మాజీ సీఎంకు మళ్లీ కోపమొచ్చింది.. చెంప చెళ్లుమంది..  

మాజీ సీఎంకు మళ్లీ కోపమొచ్చింది.. చెంప చెళ్లుమంది..  

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చేష్టలు మరోసారి వివాదస్పదమయ్యాయి. బుధవారం మైసూరు ఎయిర్ పోర్టులో పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే అసహనంతో ఊగిపోతూ చెంపపై బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా అతన్ని పక్కకు నెట్టి తన వాహనంలో వెళ్లిపోయాడు. ఏదో ఫోన్ కాల్ మాట్లాడాలంటూ అతడు సిద్ధరామయ్య చెవి దగ్గర పెట్టిన వెంటనే ఆయన కోపంతో ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా అక్కడున్నవారు వీడియో తీశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిద్ధరామయ్య తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా ఆయన చేష్టల కారణంగా ఆనేక సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఆయన చేతికి ఉన్న డైమండ్ వాచ్‌పై వివాదం చెలరేగడంతో దాన్ని ప్రభుత్వ ఖజానాకు ఇచ్చేశారు. పార్టీ కార్యక్రమంలోనూ సొంత పార్టీ నేతలపై ఆయన చిర్రుబుర్రులాడే వారు. ఓసారి మహిళా కాంగ్రెస్ నేతపై అసహనం వ్యక్తం చేస్తూ ఆమె చేతిలోని మైక్ లాక్కునే సమయంలో ఆమె చీరకొంగు కూడా రావడంతో తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. 2016లో బళ్లారిలో ఏ ప్రభుత్వ ఉద్యోగిపై చేయిచేసుకున్నారు. ఇదంతా మీడియాలో ప్రసారం కావడంతో.. ఆయన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలు, అధికారులపై తరుచూ ఇలా చిరాకును ప్రదర్శించడంపై చర్చానీయాంశంగా మారింది.

Updated : 4 Sep 2019 5:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top