సిద్దిపేట ఆస్పత్రిలో కరోనా మృతడు..గంటల తరబడ అక్కడే.. - MicTv.in - Telugu News
mictv telugu

సిద్దిపేట ఆస్పత్రిలో కరోనా మృతడు..గంటల తరబడ అక్కడే..

July 16, 2020

Siddipet coronavirus hospital inciden

కరోనా మహమ్మారి విషయంలో అణువంత నిర్లక్ష్యం కూడా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్న విషయంలో తెల్సిందే. అయినా కూడా కొన్ని హాస్పిటల్ కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తెలంగాణలోని సిద్ధిపేటలో కొత్తగా ప్రారంభించిన 100 పడకల ఆసుపత్రిలో చోటుచేసుకుంది. బుధవారం ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ హాస్పిటల్‌లో సేవలు అందించడం కోసం 28 మంది డాక్టర్లు, 150 మంది నర్సులను ప్రభుత్వం నియమించింది. ఈ హాస్పిటల్ ప్రారంభం అయిన రోజునే ఓ వృద్ధుడు కరోనా వైరస్ సోకి మరణించాడు. అయితే, గురువారం ఉదయం వరకు అతడి మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది అక్కడే ఉంచారు.

దీంతో అదే వార్డులో చికిత్స పొందుతున్న మిగతా కరోనా రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కరోనా రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల గాంధీ హాస్పిటల్‌లో కూడా జరిగిన సంగతి తెలిసిందే. కరోనా రోగి మృతదేహాన్ని దాదాపు 7 గంటలు పాటు గాంధీ ఆసుపత్రిలోనే ఉంచారు. మిగతా రోగులు ఆందోళనకు దిగడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు.