ఆ డబ్బు అంజన్ రావు ఇంట్లోనిదే.. సీపీ జోయల్ డేవిస్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ డబ్బు అంజన్ రావు ఇంట్లోనిదే.. సీపీ జోయల్ డేవిస్

October 27, 2020

nvnn

సిద్ధిపేటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నివాసంలో జరిపిన సోదాలపై  సిద్దిపేట సీపీ జోయల్ డేవీస్ స్పందించారు.  సోషల్ మీడియాలో పోలీసులపై వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. తమ సిబ్బందే డబ్బు పెట్టినట్లు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని అన్నారు. ముందస్తు సమాచారంతోనే సోదాలు చేశామని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు విడుదల చేశారు. 

ఎగ్జిక్యూటివ్ అధికారి సోదాలు చేేసేందుకు అనుమతి వచ్చిన తర్వాత సోదాలు చేశామన్నారు.  సురభి అంజన్ రావు ఇంటికి భారీగా కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో వారిని అడ్డుకోలేకపోయామని తెలిపారు. డబ్బు ఎత్తుకెళ్లిన వారిలో 20 మందిని గుర్తించి కేసులు నమోదు చేశామని చెప్పారు. డబ్బు స్వాధీనం చేసుకున్న తర్వాత సంతకాలు కూడా తీసుకున్నామని వెల్లడించారు. నిన్న నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు చేయగా ఒకరి ఇంట్లో డబ్బు లభ్యమైందని అన్నారు.