దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ శెట్టి మల్లేశం.. పరిస్థితి విషమించి మృతి చెందారు. నగరంలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లేశం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. రోజూలానే సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మల్లేశంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. దీంతో తలకు తీవ్రగాయాలు అవడంతో మల్లేశం అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.
కుటుంబసభ్యులు ఆ వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. కానీ పరిస్థితి విషమించి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లేశం మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.