హరీశ్‌రావు ‘మెదక్’ మాట నిలబెట్టుకుండు.. - MicTv.in - Telugu News
mictv telugu

హరీశ్‌రావు ‘మెదక్’ మాట నిలబెట్టుకుండు..

May 23, 2019

హామీలను నెరవేర్చడంలో అయినా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో అయినా హరీశ్ రావు ప్రత్యేకతే వేరు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందంచడంతో ముందుంటూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. అంతేకాదు గులాబీ బాస్ అడుగు జాడల్లో నడుచుకుంటూ తన సత్తా చాటుకుంటున్నారు.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరీశ్‌రావుకు.. భారతదేశంలోనే ఏ నాయకుడికి రానీ మెజార్టీ వచ్చింది. ఊహించని రీతిలో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించి, ఏకంగా 1,18,699 మెజార్టీ సాధించాడు. హరీశ్ దాటికి ప్రత్యర్థి పార్టీల నాయకులు పోటీకి దిగేందుకు వెనుకడుగు వేశారు.

Siddipet MLA Harish‌ rao Retained The Word Given To Telangana Cm KCR.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి బాధ్యతలను అల్లుడైన హరీశ్‌రావుకు అప్పగించారు. మామ చెప్పిన మాటలను తూ.చ తప్పకుండా పాటించే హరీశ్.. ప్రభాకర్ రెడ్డి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. మెదక్‌లో గతంలో కంటే అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి మామ, గులాబీ దళపతి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తానని మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం హరీశ్.. మెదక్ గడ్డ మీద ప్రభాకర్ రెడ్డి గెలుపుకోసం హరీశ్ విస్తృతంగా పర్యటించి, ప్రచారం నిర్వహించి, ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు.

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు బాధ్యతలు కేటీఆర్‌ తీసుకుని అప్పగించారు కేసీఆర్. బిడ్డ కవిత బాధ్యతలను తానే స్వయంగా చూసుకున్నారు. నిజామాబాద్‌లో సభలు నిర్వహించి, అక్కడి టీడీపీ సీనియర్ మండవ వెంకటేశ్వర రావుతో కూడా చర్చలు జరిపారు. అయినా కవిత, వినోద్ గెలుపునకు అవి ఫలిచలేదు. కానీ హరీశ్ మామకు ఇచ్చిన మాట కోసం జిల్లాలోనే పాగా వేసి, ప్రభాకర్ రెడ్డిని గెలిపించి, కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు.

అంతేకాదు బావ, బావమరిది హరీశ్, కేటీఆర్ ఓ వేదికపై కలిసినప్పుడు కరీంనగర్ లో ఎక్కువ మెజార్టీ వస్తుందని కేటీఆర్ చెప్పగా.. అందుకు హరీశ్ స్పందిస్తూ.. మెదక్‌లో అంతకంటే ఎక్కువ మెజార్టీని తీసుకోస్తానని చాలెంజ్‌లు కూడా చేసుకున్నారు. హరీశ్‌రావు కేసీఆర్‌కు ఇచ్చిన మాట ప్రకారమే.. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 3,16,388 భారీ మెజార్టీ వచ్చింది.