సిద్ధిపేట టిక్‌టాక్ సింగర్ ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

సిద్ధిపేట టిక్‌టాక్ సింగర్ ఆత్మహత్య

August 2, 2020

Siddipet Tik Tok Singer 

రాఖీ పండుగపై పాటపాడి తన టిక్‌టాక్‌లో పోస్టు చేయడంతో తెగ పాపులర్ అయిపోయాడు సిద్ధిపేటకు చెందిన ఓ యువకుడు. చాలా మంది లైకులతో అతడి ఫాలోవర్స్‌ కూడా పెరిగారు. అలాంటి వ్యక్తి రాఖీ పండగకు ఒక రోజు ముందే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం ఉదయం తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.   

కోడూరు మండలం గంగాపూర్‌ గ్రామానికి గడ్డం రాజు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ తెగ యాక్టీవ్‌గా ఉండే వాడు. పాటలు కూడా పాడుతుండటంతో అతనికి ఫాలోవర్స్ పెరిగిపోయారు.  ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే.. ఇక లేడని ఇక రాడని చెప్పమ్మా’ అనే పాటతో కొన్ని రోజుల  క్రితం పాపులర్ అయ్యాడు. కానీ అతడే ఇలా అదే పండగకు ఒకరోజు ముందే ప్రాణాలు వదలడం అందరిని కలిచివేసింది. రాజు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. రాఖీ పాటలతో పాటు చాలా పాటలు రాజు టిక్‌టాక్‌లో పాడి అలరించే వాడు. రాజు విషయం తెలిసి అతని ఫాలోవర్స్ గతంలో పాడిన పాటలను వైరల్ చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.