సిద్దిపేటలో హెలికాప్టర్ ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

సిద్దిపేటలో హెలికాప్టర్ ప్రమాదం

November 24, 2017

సిద్దిపేట జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భవనం వద్ద శిక్షణ హెలికాప్టర్  గాల్లో చక్కర్లు కొడుతూ సాంకేతిక లోపంతో దిగిపోయింది. ట్రైనీ పైలెట్లు పారాచూట్ సాయంతో  కిందికి దూకి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.  కొండపాక మండలం దుద్దెడలో నూతనంగా కలెక్టర్ భవనాన్ని నిర్మిస్తున్నారు.  స్వల్పంగా గాయపడిన పైలెట్లను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.