Side Effects With Tight Clothing : What happens when you wear tight clothing for a long time
mictv telugu

Tight Clothing : బిగుతైన దుస్తులను ఎక్కువ కాలం వేసుకుంటున్నారా?

February 16, 2023

అందరూ ట్రెండ్స్ ని అనుసరించడం.. ఫ్యాషన్ గా ఉండాలనుకోవడంలో తప్పులేదు. కానీ అవి మనకు ఎంతవరకు ఇబ్బంది కలుగకుండా చేస్తాయో కూడా ఆలోచించాలి. బిగుతుగా ఉండే దుస్తుల వల్ల ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్స్ చాలావరకు ఒంటిని అతుక్కునేలానే ఉంటున్నాయి. ఇవి ఇష్టంగా వేసుకుంటాం, కానీ కొంతకాలం తర్వాత చర్మానికి మనం నష్టం చేసినట్టే అవుతుందని అంటున్నారు. ఈ దుస్తులు కడుపుపై ఒత్తిడిని కలిగించి.. జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు.

నిపుణుల సలహా..

బిగుతుగా ఉన్న దుస్తుల వల్ల రక్తప్రవాహం దెబ్బతీయవచ్చు. నరాల దెబ్బతినవచ్చు. అది పక్కన పెడితే.. బిగుతైన దుస్తుల వల్ల చర్మంపై దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా కలుగుతాయి. వాతలు పడే దుస్తులు, ఒత్తిడిని కలిగించే దుస్తులను, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అనిపించే దుస్తులను ధరించడం మానుకోవాలి. ‘సౌకర్యవంతమైన, శ్వాస తీసుకోవడానికి అనుగుణంగా ఉన్న దుస్తులను ధరించడం చాలా ముఖ్యం. అసౌకర్యాన్ని కలిగించే దుస్తుల జోలికి వెళ్లకండి. మెత్తటి, వదులుగా ఉండే దుస్తులను వాడండి, నైలాన్, రెసిన్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్ లను నివారించండి’ అంటూ డెర్మాటాలజిస్ట్ లు తెలియచేస్తున్నారు.

బిగుతైన దుస్తుల వల్ల ప్రభావాలు..

1. బిగుతుగా ఉండే ప్యాంటు లేదా షేప్ వేర్స్ ను ధరిస్తే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. చెమటతో తడిసిన దుస్తులు, ఈత దుస్తులను, వ్యాయామం చేశాక దుస్తులను వెంటనే మార్చుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్స్ పెరిగే ప్రమాదం ఉంది.

2. బిగుతుగా ఉండే దుస్తులు ఒంటి నుంచి వచ్చే చెమటను బంధించేస్తుంది. దీనివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఆ ప్రాంతాల్లో గడ్డలు, మొటిమలు వచ్చేస్తాయి.

3. వీపు భాగంలో, టైట్ బెల్ట్, ప్యాంట్స్, స్కర్టులు ధరించడం వల్ల రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పుడుతుంది. కాలక్రమేణా వీటి వల్ల అక్కడ ఎర్రని గుర్తులు ఏర్పడుతాయి.

4.బిగుతుగా ఉండే దుస్తుల వల్ల చర్మం ఒకదానికొకటి తాకి అక్కడ ఇబ్బంది కలుగవచ్చు. ముఖ్యంగా తొడలు, అండర్ ఆర్మ్స్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.