Sidharth-Kiara To Host Feast Of 100 Dishes From 10 Countries For Guests On Their Wedding 
mictv telugu

10 దేశాల నుంచి 100 వంటకాలని వడ్డిస్తున్నారట!

February 6, 2023

Sidharth, kiara, weeding, food, marriage, countries

సిద్దార్థ్ మల్హోత్రా.. కియారా అద్వానీల వివాహం కానుంది. మరో బాలీవుడ్ జంట ఒక్కటి కానుంది. వారి వివాహ వేడుకకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తున్నది.
సిధ్ – కియారా పెండ్లి డ్రెస్ ని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఆ పెండ్లి బట్టల్లో వాళ్లు ఎలా ఉంటారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సెలెబ్రిటీలంతా జైసల్మేర్ కి చేరుకున్నారు. వీరికోసం సూర్యగఢ్ ప్యాలెస్ లో 70 ప్లస్ రూమ్ లను బుక్ చేశారు.

ఈ బాలీవుడ్ జంట పెండ్లిలో.. ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల నుంచి 100వంటకాలను హోస్ట్ చేస్తున్నట్లు కొన్ని నివేదికలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడ రుచికరమైన వంటకాలతో తమ అతిథులకు విందు వడ్డించనున్నారు. మెనూలో ఇటాలియన్, అమెరికన్, చైనీస్, మెక్సికన్, సౌత్ ఇండియన్, రాజస్థానీ, గుజరాతీ, పంజాబీ వంటకాలు ఉన్నాయి. అంతేకాదు.. జైసల్మేర్ ప్రసిద్ధ ఘోత్వాన్ లడ్డూలకు ఫేమస్. ఈ వంటకం కూడా మెనూలో భాగమైందట.

ప్రతీ అతిథికి..
పంజాబీ కుర్రాడు, బాలీవుడ్ హీరో.. సిద్దార్థ్ మల్హోత్రా ఢిల్లీ, పంజాబ్ నుంచి వచ్చే అతిథుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని వార్త. ఒక న్యూస్ నివేదిక ప్రకారం.. 500మంది వెయిటర్ లను నియమించారు. వారికి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ పెట్టి 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి అతిథికి ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని ఈ వెయిటర్స్ వడ్డన చేస్తారట.

నో ఫోన్..
కియారా అద్వానీ సోదరుడు మిషాల్ అద్వానీ తన సోదరి పెండ్లిలో ప్రత్యేకమైన ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమయ్యాడని ఒక వార్త చక్కర్లు కొడుతున్నది. మిషాల్ అద్వానీ.. ఒక రాపర్, కంపోజర్, సంగీత దర్శకుడు. వారి ప్రత్యేకమైన రోజు కోసం ఒక పాటను కూడా సిద్ధం చేశారు. వివాహానికి ముందు జరిగే కొన్నిఫంక్షన్లలో షాహిద్ కపూర్, కరణ్ జోహార్ ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తున్నారని సమాచారం. విక్కీ- కత్రినాల పెళ్లిలో మాదిరిగానే ‘నో ఫోన్ పాలసీ’ని వీరి పెండ్లిలోనూ అమలు చేస్తున్నారు. వివాహ వేదిక వరకు అతిథులు రావడానికి 70

లగ్జరీ కార్లను ఏర్పాటు చేసిందీ జంట.
సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ‘షేర్షా’ సెట్స్ లో కలుసుకున్నారు. షూటింగ్ సమయంలో వీరు స్నేహితులుగా మారారు. ఆ తర్వాత వీరి మధ్య ఏదో ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటికి సంబంధించి సిధ్ – కియారా అధికారికంగా ఎన్నడూ అంగీకరించలేదు. కానీ తరుచూ పార్టీల్లో, హాలీడే ట్రిప్స్ లో కనిపించేవారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటికానున్నారు.