ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. సీడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహించగా, అందులో ఓడిపోయిన రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను రాజీనామా చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే రాజీనామా చేయగా, తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ట్విట్టర్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు కోరిన విధంగా రాజీనామా చేశానని ప్రకటించారు. కాగా, పంజాబ్ ఎన్నికలకు ముందే సిద్ధూ ఆ పదవిలోకి వచ్చారు. ఇదిలా ఉండగా, ఎన్నికల ఫలితాలనంతరం సిద్ధూ స్పందిస్తూ పంజాబ్ ఓటర్లు తెలివైన నిర్ణయం తీసుకున్నారంటూ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది.