లండన్‌లో అల్లర్లు.. ముగ్గురు సిక్కుల మృతి - MicTv.in - Telugu News
mictv telugu

లండన్‌లో అల్లర్లు.. ముగ్గురు సిక్కుల మృతి

January 21, 2020

Sikh Men.

బ్రిటన్ రాజధాని నగరం  లండన్‌లో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కత్తులతో దాడి చేయడంతో ముగ్గురు సిక్కులు మరణించారు. ఇల్ ఫోర్డ్ సెవెన్ కింగ్స్  ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. దీంతో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.  దీనికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మాణ పనుల కోసం చెల్లించాల్సిన డబ్బుపై రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. కత్తులతో దాడి జరగడంతో తీవ్ర గాయాలపాలై మరణించారు. మృతులు హరీందర్ కుమార్ (22), నరీందర్ సింగ్ (26), బల్జిత్ సింగ్ (34) గా గుర్తించారు.