Sikh Woman In Canada Designs Special Helmets For Her Children
mictv telugu

పిల్లల కోసం ప్రత్యేక హెల్మెట్ తయారుచేసింది!

January 7, 2023

 Sikh Woman In Canada Designs Special Helmets For Her Children

కెనడాకు చెందిన సిక్కు మహిళ ఒక థెరపిస్ట్. ఆమె తన పిల్లల కోసం ప్రత్యేక హెల్మెట్ తయారు చేసి సేఫ్టీ సర్టి ఫై తీసుకున్నది. ఇలా తయారైన మొదటి హెల్మెట్స్ ఇవి.
టీనా సింగ్ కెనడాలో నివాసముంటున్న భారతీయురాలు. ఆమెకు ఇద్దరు పిల్లలు. సిక్కు సంప్రదాయం ప్రకారం పిల్లలు తమ వెంట్రుకలను పెంచుకుంటున్నారు. అయితే ఈ మధ్య సైకిల్ రైడ్ నేర్చుకోవాలనుకున్నారు. వారు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు. దీంతో ఆ తల్లి వారి బాధను అర్థం చేసుకుంది. వారికోసం ఏదైనా చేయాలనుకుంది.

 

ఒక్కటనే కాదు..
కేవలం బైక్, సైకిల్ రైడ్స్ అప్పుడు మాత్రమే హెల్మెట్ ధరించడం కాదు. క్రీడలు ఆడేటప్పుడు కూడా హెల్మెట్ అవసరం ఉంటుంది. దీనికోసం టీనా మార్కెట్ లో చాలా హెల్మెట్లను వెతికింది. సరైనవి దొరక్క పెద్ద పెద్ద హెల్మెట్లను పిల్లల కోసం కొనేది. కానీ అవి తన సమస్యకు పరిష్కారం కాదని అనుకుంది. తలపాగాకు అడ్డు రాకుండా ఉండేదందుకు ఏదైనా చేయాలని ఆలోచించింది.

సర్టిఫై కోసం..
రెండు సంవత్సరాలుగా.. ఆమె హెల్మెట్ విభిన్న వెర్షన్ లను పరీక్షించింది. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఉత్పత్తిలో ఉంది. సైకిళ్లు, ఇన్ లైన్ స్కేట్స్, కిక్ స్కూటర్ల కోసం ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లల కోసం స్కేట్ బోర్డింగ్ తో ఉపయోగించవచ్చని ధృవీకరించారు. ఇది పిల్లల వెంట్రుకలకు సరిపోయేలా పైన గోపురం ఉంటుంది. అంతేకాదు.. ఈ హెల్మెట్ ప్రత్యేకత. కనుబొమ్మపైన రెండు వేళ్ల అంత ఖాళీ స్థలం, చెవి చుట్టూ వీ ఆకారాన్ని ఉంచింది. చిన్న స్ట్రాప్ కూడా ఉంది. గత డిసెంబర్ లో హెల్మెట్ అంతర్జాతీయ టెస్టింగ్ కంపెనీ ఎస్జీఎస్ నుంచి ఉత్తీర్ణత గ్రేడ్ ను పొందింది.

అందమైన క్షణం..
‘చాలామంది తమ తలపాగాను కప్ప ఉంచే హెల్మెట్స్ ధరించరు. దీనివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాలి. కానీ నేను హెల్మెట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నా. ఇది నిజంగా వాస్తవం. నాకు ఒక అందమైన క్షణం. నేను నా పిల్లల కోసం దీన్ని చేశాను. వారు నిజంగా దాని ప్రయోజనాన్ని పొందం నాకు అద్భుతమైనది’ అని అంటున్నది టీనా సింగ్.