ఆర్ధికంగా పెరిగినా పెరగకపోయినా జనాభా పెరుగుదలలో మనం ఎప్పుడూ ముందుంటాం. భారతదేశ పాపులేషన్ ఇప్పటికే 140 కోట్లు క్రాస్ చేసేసింది. వద్దురా బాబోయ్ అంటున్నా వినకుండా మనవాళ్ళు పిల్లలని కంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు అని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అయితే మొత్తం దేశం అంతా ఒక లెక్క మాది ఒక్కటీ ఒక లెక్క అంటున్నారు సిక్కిం సీఎం. పిల్లలని కనండి ఇంక్రిమెంట్ తీసుకోండి అంటూ కొత్త పాలసీని ప్రవేశపెట్టారు.
సిక్కిం మాఘే సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ తమ జాతి జనాభాను పెంచండి అంటూ ప్రసంగించారు. అంతటితో ఊరుకుంటే బాగుండేది కానీ ముగ్గురు పిల్లలని కంటే డబుల్ ఇంక్రిమెంట్ ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రోత్సాహకాలు అందుతాయని భరోసా ఇచ్చారు.
ఇద్దరు పిల్లలని కంటే ఇన్సెంటివ్స్, ముగ్గురిని కంటే డబుల్ ఇంక్రిమెంట్ దాంతో పాటూ ఎక్కువ సెలవులు తీసుకునేందుకు అనుమతి కూడా ఉంటుందని చెప్పారు. సిక్కింలో సంతానోత్సత్తి రేటు ఈమధ్య కాలంలో చాలా తగ్గిపోయింది. అందుకే సీఎం ఇలాంటి ప్రకటన చేశారుట. వీటితో పాటూ ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు అవసరమైన డబ్బును కూడా ఇస్తాయని ప్రకటించారు. ఐవీఎఫ్ లో పిల్లలని కనే ఉద్యోగినులకు 3 లక్షల రూపాయలు ఇస్తాయని తెలిపారు. సీఎం ప్రేమ్ పింగ్ తమాంగ్ ప్రకటన మీద సిక్కిం మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నట్టు అక్కడ పిల్లలు పుడితే పితృత్వ సెలవులు కూడా ఇస్తామని చెప్పారుట.