అక్కడంతే..మాస్క్ ధరించకపోతే వింత శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

అక్కడంతే..మాస్క్ ధరించకపోతే వింత శిక్ష

July 11, 2020

bvc j

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అయిన సంగతి తెల్సిందే. అయినా కూడా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మాస్క్ ధరించకుండా జనాల్లో తిరుగుతున్నారు. తద్వారా తమ ప్రాణాలను రిస్క్ లో వేయడమే కాకుండా ఎదుటువటి ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. దీంతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధిస్తున్నారు.

ఇదిలా ఉంటే మాస్క్ ధరించని వారికి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి ట్రాఫిక్ పోలీసులు వింత శిక్ష విధిస్తున్నారు. సిలిగురి పోలీసులు రోడ్లపై మాస్క్ ధరించకుండా వచ్చిన వారిని రోడ్డుపై రెండు గంటలపాటు కూర్చోబెట్టి ‘నిరీక్షణ శిక్ష’ విధిస్తున్నారు. దీంతో ప్రజలు మాస్క్ పెట్టుకోకుండా బయటికి రావడం లేదు. రోడ్డు పై రెండు గంటలు కూర్చోబెడితే పరువు పోతుందని ఈ శిక్ష బాధితులు అంటున్నారు. ఇంకోసారి మాస్క్ పెట్టుకోకుండా బయటికి రామని చెబుతున్నారు. సిలిగురిలో కరోనా వైరస్ కేసులు పెరిగిన నేపథ్యంలో అక్కడి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని 9 మున్సిపల్ వార్డులు, డార్జిలింగ్, జల్ పాయ్ గురి జిల్లాల్లో పూర్తిగా లాక్ డౌన్ విధించారు.