30 ఏళ్ల తర్వాత.. వెండి సూర్య వాహనంపై వెంకన్న  - MicTv.in - Telugu News
mictv telugu

30 ఏళ్ల తర్వాత.. వెండి సూర్య వాహనంపై వెంకన్న 

October 23, 2020

Brahmotsavalu

తిరుమలలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అతి కొద్ది మంది సమక్ష్యంలోనే మలయప్ప స్వామికి పూజలు చేస్తున్నారు. దీంట్లో భాగం మూడు దశాబ్ధాల క్రితం స్వామి విహరించిన వాహనాన్ని బయటకు తీయాల్సి వచ్చింది. ఊరేగింపులో భాగంగా వెండి సూర్య భగవానుడి వాహనాన్ని టీటీడీ అధికారులు ఉపయోగించారు. ఆ వాహనంలో స్వామిని ఆలయంలోకి తీసుకువెళ్లి, ఉత్సవ విగ్రహాలను అలంకరించి, ఏకాంత సేవలు జరిపించారు.

గడిచిన 30 ఏళ్లుగా శ్రీనివాసుడిని బ్రహ్మోత్సవాల్లో బంగారు సూర్య ప్రభ వాహనంపై ఊరేగిస్తున్నారు. కానీ ఇటీవల మాత్రం వెండి సూర్య ప్రభ వాహనం బయటకు తీశారు. నిజానికి బంగారు వాహనం పరిమాణం భారీగా ఉండటంతో దానికి ఎక్కువ మంది అవసరం ఉంటుంది. కరోనా కారణంగా కొంత మంది సిబ్బంది మాత్రమే ఉండటంతో దాన్ని లోపలికి తీసుకువెళ్లే వీలు లేకపోయింది. దీంతో వెండి సూర్యదేవుని రథ వాహనంపై సేవను నిర్వహించాల్సి వచ్చింది.వేద పారాయణం జరిపి, నైవేద్యాలు సమర్పించారు. మరోవైపు భక్తులు తలా ఓ చెయ్యి వేసి నిర్వహించే రథోత్సవాన్ని ఈ సంవత్సరం రద్దు చేసిన సంగతి తెలిసిందే.