వెండికీ కొమ్ములొచ్చాయి..ఒక్కరోజే రూ.2 వేలు పైకి - MicTv.in - Telugu News
mictv telugu

వెండికీ కొమ్ములొచ్చాయి..ఒక్కరోజే రూ.2 వేలు పైకి

August 13, 2019

Silver Rate.

బంగారం, వెండి ముట్టుకోకుండానే  షాక్ కొట్టేస్తున్నాయి. పోటాపోటీగా ధరలు పెరుగుతూ వినియోగదారులను కలవరపెట్టిస్తున్నాయి. నిన్నటి వరకు బంగారం ధరకు రెక్కలు రాగా ఆ జాబితాలో వెండి కూడా చేరిపోయింది. తెల్ల లోహం ఖరీదుఇవాళ ఒక్కరోజే రూ. 2000 ధర పెరిగి జీవిత కాల గరిష్ట రేటును తాకింది.ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 45 వేలకు చేరుకుంది.

అంతర్జాతీయంగానూ వెండి, బంగారం ధరలు ఇదే విధంగా పెరుగుతున్నాయి. ఈ క్విటీ మార్కెట్లో ఒత్తిడి పెరగడంతో చాలా మంది ముదుపరులు  బంగారం, వెండిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ కారణంగా వాటి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా బంగారం ధర రూ. 100 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ. 38,370కి చేరింది. వెండి మాత్రం రూ. 2వేలు పెరిగింది.