సెంచరీ కొట్టిన సింబు - MicTv.in - Telugu News
mictv telugu

సెంచరీ కొట్టిన సింబు

October 19, 2017

 

సింబు అనబడే తమిళ స్టార్ హీరో సిలంబరసన్ సెంచరీ కొట్టింది సినిమాల్లోనా, లేక క్రికెట్లోనా అని అనుమానమొచ్చిందా? అతడు నిజంగానే సెంచరీ కొట్టాడు. గట్టిగా యాభై చిత్రాల్లో కూడా నటించని సింబు సింగర్‌గా 100 పాటలు పాడేశాడు. హీరోలు పాటలు పాడటం ఈ మధ్య మామూలు అయిపోయింది.

కానీ యిన్ని పాటలు పాడిన హీరోగా రికార్డు సృష్టించిం మాత్రం సింబూనే. మనీషా ఎన్ మనీషా(1999)అనే తమిళ చిత్రంతో పాటలు పాడటం మొదలు పెట్టిన సింబు రీసెంట్ గా “ఎన్ ఆనోడ సెరుప్ప కానోమ్(2017)’ చిత్రంలో పాడిన పాటతో వంద పాటలు పాడటం పూర్తి చేశాడు. సింబు తెలుగులో కూడా బాద్షా, పోటుగాడు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వంటి చిత్రాల్లో పెప్పీ నంబర్స్ పాడాడు.

2015 లో అనిరుధ్ మ్యూజిక్ డైరక్షన్‌లో పాడిన “బీప్ సాంగ్’ పెద్ద వివాదానికి కారణం అయింది. మహిళా సంఘాలు కేసులు పెడితే కొన్నాళ్ళు సింబు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరగాల్సిన ఖర్మ పట్టింది.  హీరోయిన్స్‌తో సహా ఎవరితో ఒకరితో యేదో ఒక వివాదాలతో వార్తల్లో వుండే సింబు ఈ సారి మాత్రం ఒక రైట్ రీజన్‌తో సెన్సేషన్‌గా మారాడు.