ఇండియన్ 2 ఎఫెక్ట్..శింబు సినిమా యూనిట్‌కు బీమా - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియన్ 2 ఎఫెక్ట్..శింబు సినిమా యూనిట్‌కు బీమా

February 26, 2020

bmvbm

ఇటీవల ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌లో జరిగిన క్రేన్ ప్రమాదం దేశంలోని అన్ని భాషల చిత్ర పరిశ్రమలను ఉలిక్కిపడేలా చేసింది. కార్మికులకు భద్రత కరవవుతోందని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ‘ఇండియన్ 2’ హీరో కమల్‌హాసన్‌ కూడా ఉన్నారు. అంతేకాకుండా సినీ కళాకారులకు బీమా లేకపోవడం మరింత బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీరో నుంచి చిన్నపాటి కార్మికుడి వరకు బీమా ఉండాలని పలువురు కోరుతున్నారు. 

ఈ నేపథ్యంలో శింబు హీరోగా నటిస్తున్న ‘మానాడు’ నిర్మాత సురేష్‌ కామాక్షి తన సినిమా కోసం పనిచేస్తున్న కార్మికులందరికీ బీమా చేయించారు. ఓ సంస్థతో దాదాపు రూ.30 కోట్ల విలువైన బీమా చేయించారని, దీనికి ఆయన రూ.7.8 లక్షలు ప్రీమియంగా చెల్లించారని సినిమా యూనిట్ తెలిపింది. నిర్మాత తీసుకున్న నిర్ణయం పట్ల చిత్ర కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శింబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.