ద్యావుడా.. పాముతో ఓ ఆట ఆడేసుకున్న పూజారీ - MicTv.in - Telugu News
mictv telugu

ద్యావుడా.. పాముతో ఓ ఆట ఆడేసుకున్న పూజారీ

May 20, 2020

gn vcn

లాక్‌డౌన్ కారణంగా అన్ని ఆలయాల భక్తుల రాకను నిలిపివేశాయి. దీంతో ఆ ప్రాంతాలన్ని నిర్మానుషంగా మారడంతో వన్యప్రాణులు, సర్పాలు ఆలయాల్లో తరుచూ కనబడుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పాము హల్ చల్ చేసింది. 9 అడుగుల పొడవైన పాము ఆలయంలోని వంటశాల సమీపంలోకి వచ్చింది. దీంతో దాన్ని చూసిన ఆలయ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. 

విషయం తెలిసిన వెంటనే ఉప ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు అక్కడికి వచ్చి పామును తన చేతితో పట్టుకున్నాడు. తోకను చాకచక్యంగా పట్టుకొని దాన్ని సంచిలో వేసుకెళ్లి.. సమీపంలోని తోటల్లోకి వదిలేస్తారు. అర్చకుడు తన చేతితో పామును పట్టుకోగానే అది గిలగిలా అటూ ఇటు కొట్టుకుంటూ కనిపించింది. ఆయన ఏ మాత్రం భయం లేకుండా దాన్ని జాగ్రత్తగా అడవుల్లో వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఆలయ సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. అయితే తరుచూ ఆలయంలో పాములు రావడం, వాటిని పట్టుకొని అడవుల్లో వదిలిపెడుతున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.