భోపాల్ గ్యాస్ లీకేజీలా.. విశాఖలో 5 వేల మందికి అస్వస్థత  - Telugu News - Mic tv
mictv telugu

భోపాల్ గ్యాస్ లీకేజీలా.. విశాఖలో 5 వేల మందికి అస్వస్థత 

May 7, 2020

Similarities between vizag gas leakage with Bhopal gas leakage 

రోడ్లపై కుప్పకూలిన మనుషులు.. నురగలు కక్కుకుని ప్రాణాలు విడిచిన పశువులు, పక్షులు. ఫుట్ పాత్, కాలువ, రోడ్డు, ఇల్లు, గుడి.. ఎక్కడ చూసిన శ్వాస ఆడక కళ్లు తేలేస్తున్న జనం.. పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. చివరకు చెట్లపై పూలు కూడా నల్లగా కమిలిపోయాయి..  ఇదీ విశాఖనగర విషాద దృశ్యం. 1984 డిసెంబర్ నాటి భోపాల్ గ్యాస్ లీకేజీని కళ్ల ముందు నిలిపిన ఇలాంటి బీభత్సం సమీపగతంలో భారత దేశంలోనే కాదు, ప్రపచంలో ఎక్కడా లేదు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల దూరంలో భయానక వాతావరణం నెలకొంది. లీకైన కార్సన్ మోనాక్సైడ్ వాయువు అత్యంత ప్రమాదకరం కావంతో సహాయక సిబ్బంది హెల్మెట్లు పెట్టుకుని, శరీరాన్ని పూర్తిగా కప్పే కోట్లు ధరించారు. ఇళ్లలో ఎంతమంది అస్వస్థతకు గురయ్యాలో తెలియడం లేదు. 5 వేల మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వారిలో ప్రస్తుతం 2 వేల మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలు, ఇప్పటికే ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారి పరిస్థితి విషమంగా ఉంది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నా పరిశ్రమను ఎందుకు తెరిచారన్నది అనుమానం రేకెత్తిస్తోంది. బుధవారం ట్రయల్ రన్ ప్రారంభించామని, రెండు నెలలుగా గ్యాస్ నిల్వ ఉండడంతో ఒత్తిడి వల్ల లీకై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

భోపాల్‌తో పోలికలు.. 

విశాఖ గ్యాస్ లీకేజీకి భోపాల్ గ్యాస్ ఘటనతో పోలికలు ఉన్నాయి. వైజాగ్‌లో అర్ధరాత్రి 2 నుంచి మూడు గంటల ప్రాంతంలో లీక్ కాగా, భోపాల్ నగరంలోనూ యూనియన్ కార్బైన్ పరిశ్రమ నుంచి రాత్రి పూటే గ్యాస్ లీకైంది. దాదాపు 45 వేల మంది అస్వస్థతకు గురయ్యారు. నగరంలో ముప్పావు వంతు ప్రాంతంతో ప్రభావం కనిపించింది. ప్రజలు ఊపిరాడక నరకయాతన అనుభవించారు. పక్షవాతం, కళ్లమంటలు, బొబ్బలు.. అనేక రకాల అనారోగ్యానికి గురయ్యారు. మరణాలపై కచ్చితమైన లెక్కలేవీ లేవు. 4 వేల నుంచి 20 వేల మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా. 3 వేల మంది గ్యాస్ లీక్ వల్ల, మిగతా వారు తర్వాత జబ్బుపడి చనిపోయి ఉంటారని అంచనా.