పోలీసులపై సినిమాలు తీసినందుకు సిగ్గుపడుతున్నా : ‘సింగం’ దర్శకుడు - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులపై సినిమాలు తీసినందుకు సిగ్గుపడుతున్నా : ‘సింగం’ దర్శకుడు

June 29, 2020

Singam Movie Director Angry In Tamil Nadu Police

పోలీసులను హీరోలుగా చూపిస్తూ వరుస విజయాలను అందుకున్న ‘సింగం’ సినిమా దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోలీసు సినిమాలు చేసినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నానని హరి గోపాలకృష్ణన్ అన్నారు. వాళ్ల ధైర్య సాహసాలను హైలైట్ చేస్తూ సినిమాలు తీసి తప్పు చేశానని పేర్కొన్నాడు. తమిళనాడులో వరుసగా లాకప్ డెత్‌లు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ విధంగా మాట్లాడారు. ఇలాంటి హత్యలు మరోసారి జరగకూడదని అభిప్రాయపడ్డారు.  కొంత మంది వల్ల మొత్తం పోలీసు వ్యవస్థ పరువు పాతాళంలోకి వెళ్లిపోయిందని తెలిపారు.

హీరో విక్రమ్‌తో ‘సామి’ హీరో సూర్యతో ‘సింగం’ సినిమాలు చేసి విజయాలను సాధించారు. అందులో పోలీసులు వారి కర్తవ్యాలను ఎలా నిర్వహిస్తారు.. వారి హీరోయిజాన్ని చూపిస్తూ.. అందరితో ప్రశంసలు పొందారు. తుత్తుకూడిలో తండ్రీ కొడుకుల లాకప్ డెత్, మరో చోట ఆటో డ్రైవర్ పై దాడి ఘటనలను హరి గోపాలకృష్ణన్ తీవ్రంగా ఖండించారు. ఇంత దారుణంగా వారిని హింసించి చంపడం ఏంటని ప్రశ్నించారు. తాను ఇప్పటి వరకు ఐదు పోలీసు సినిమాలు చేశానని, ఇక ముందు అలాంటి తప్పు చేయబోనని అన్నారు. తమిళనాడులో ఇలాంటి ఘటనలు మరోసారి జరుగ కూడదని కోరుకుంటున్నానని చెప్పారు. కాగా ఇప్పటికే వరుస లాకప్ డెత్‌లపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.