మూత్రంతో చేసిన బీర్లు.. గటగటా తాగేస్తున్న ప్రజలు - MicTv.in - Telugu News
mictv telugu

మూత్రంతో చేసిన బీర్లు.. గటగటా తాగేస్తున్న ప్రజలు

May 28, 2022

నీటి కొరతతో బాధపడుతున్న సింగపూర్ ప్రజలు వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి మూత్రంతో చేసిన బీర్లను తాగుతున్నారు. డ్రైనేజీ వాటర్‌ని ఫిల్టర్ చేసి కొత్తగా తయారు చేసిన బీర్లకు బాగా డిమాండ్ ఉందని అక్కడి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వాటర్ ఏజెన్సీ పీయూబీ, స్థానిక బీరు తయారీ కంపెనీ బ్రూవర్క్‌జ్‌లు కలిసి ‘న్యూబ్రూ’ అనే బీరును తయారు చేశాయి. దీనికి ముడి సరుకు వచ్చేసి డ్రైనేజీ వాటర్‌ను పూర్తిస్థాయిలో శుద్ధి చేసి రూపొందించి న్యూవాటర్‌ను ఉపయోగించారు. మంచి మాల్ట్‌ కలపడంతో తాగాక తేనె రుచి వస్తోందని బీరు బాబులు కితాబిస్తున్నారు. కాగా, చుట్టుపక్కల సముద్రం ఉంగే సింగపూర్ దేశం మంచినీటిని మలేషియా నుంచి కొనుగోలు చేస్తుంది.