Singapore allows Sri Lanka president entry on private visit, says no asylum request
mictv telugu

సింగపూర్‌కు పరారైన రాజపక్స!.. అక్కడి ప్రభుత్వం చెబుతున్నది ఇదే

July 14, 2022

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాల్దీవుల నుంచి నుంచి కూడా పరారయ్యారు. తన కుటుంబంతో సహా ఆయన సింగపూర్ చేరుకున్నారు. అయితే గొటబయ ప్రైవేటు ప‌ర్య‌ట‌న నిమిత్తమే త‌మ దేశానికి వ‌చ్చార‌ని సింగ‌పూర్ విదేశాంగ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. త‌న‌కు సింగపూర్‌లో ఆశ్ర‌యం ఇవ్వాల‌ని ఆయ‌న కోర‌లేద‌ని, అలాగే తాము ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. మొద‌ట శ్రీ‌లంక నుంచి మాల్దీవుల‌కు పారిపోయిన గొట‌బయ రాజ‌ప‌క్స అక్క‌డి నుంచి నేడు సింగ‌పూర్‌కు చేరుకున్నారు. సింగ‌పూర్ ప్ర‌భుత్వం ఆశ్ర‌యం ఇచ్చి ఉండొచ్చ‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సింగ‌పూర్ విదేశాంగ శాఖ దీనిపై స్ప‌ష్ట‌త ఇచ్చింది.

మాల్దీవుల నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం-ఎస్వీ 788లో రాజ‌ప‌క్స సింగ‌పూర్ చాంగీ విమానాశ్ర‌యం చేరుకున్నారు. గొట‌బయ రాజప‌క్స సింగ‌పూర్‌కు పారిపోయిన‌ప్ప‌టికీ శ్రీ‌లంక‌లో ఆందోళ‌న‌కారులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. గొట‌బయ రాజ‌ప‌క్స అధ్యక్ష ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండా విదేశాల‌కు పారిపోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నెల 13న రాజీనామా చేస్తానని మాటిచ్చిన ఆయన మాట తప్పారు. రాజీనామా ఇవ్వకుండానే దాగుడుమూతలాడుతున్నారు. రాజీనామా చేస్తే తనను అరెస్ట్ చేసే అవకాశాలుండటంతో ఆయన రాజీనామాకు వెనుకాడుతున్నారని సమాచారం.