అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సింగపూర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సింగపూర్‌

November 12, 2019

ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి నుంచి ఇప్పటికే పలు ప్రపంచ స్థాయి సంస్థలు తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా సింగపూర్ కూడా అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అమరావతిలోని స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్లు సింగపూర్‌ ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ తెలిపారు. 

amaravati.

స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధిపై కొన్ని ఇబ్బందులు తలెత్తినందున ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సింగపూర్‌ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రాజధాని ప్రాంతంలో దాదాపు 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాజెక్టును చేపట్టాలని గత ప్రభుత్వం 2017లో సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల తమ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండదని మంత్రి ఈశ్వరన్‌ స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సింగపూర్‌ కంపెనీ పెట్టుబడులపై దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదని తెలిపారు.