మాస్కుల తయారీకి గొర్రెలు కావాలట.. నోరుజారిన మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

మాస్కుల తయారీకి గొర్రెలు కావాలట.. నోరుజారిన మంత్రి

June 2, 2020

Singapore Minister Chan Chun Sing Tongue Slip

కరోనా కట్టడిలో మాస్కుల తయారీకి కాటన్ కావాలి. కానీ దాన్ని ఉత్పత్తి చేసే గొర్రెలు సరిపడా మా దగ్గర లేవు. ఇదేంటి మాస్కుల తయారీకి గొర్రెలకు లింకు ఏంటని అనుకుంటున్నారా.? అవును ఏకంగా సింగపూర్ మంత్రి స్వయంగా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. అనుకోకుండా నోరు జారిన ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ.. నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. 

ఆ దేశ పరిశ్రమల మంత్రి చాన్‌ చున్‌ సింగ్‌ మాస్కుల లోటుపై మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో మాస్కులను సరిపడా అందించలేకపోతున్నామని అంగీకరించారు. అయితే వాటి తయారీకి తగిన ముడి సరుకులకు కావాల్సిన గొర్రెలు సింగపూర్‌లో లేవన్నారు. ఆ తరువాత తన పొరపాటును గ్రహించి తనలో తానే నవ్వుకున్నారు. వాటిని సరి చేసుకొని వివరణ ఇచ్చారు. కానీ అప్పటికే ఆ మాటలు ప్రసారం కావడంతో నెటిజన్లకు దొరికిపోయారు. దీంతో వారంతా కాటన్ పత్తి నుంచి వస్తుంది..గొర్రెల నుంచి కాదు సార్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కాగా గతంలోనూ ఆయన లాక్‌డౌన్ సమయంలో మాల్స్ ముందు క్యూ కట్టిన ప్రజలను ‘ఇడియట్స్‌’ అని సంబోధించి చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.