Singapore Open 2022 : PV Sindhu Won First Super 500 Title
mictv telugu

సింగపూర్ ఓపెన్ విజేత పీవీ సింధు.. చైనీస్ ప్లేయర్‌కు చుక్కలు చూపించి..

July 17, 2022

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో వాంగ్‌ జి యిపై గెలుపొందింది. 21-9, 11-21, 21-15 తేడాతో వాంగ్‌ జి యిని సింధు ఓడించింది. ఫైనల్ క్లాష్‌లో పీవీ సింధు వాంగ్ జి యితో హోరాహోరీగా తలపడి, మూడు సెట్లలో రెండింటిని గెలుచుకుని, తన సత్తా చాటింది. తొలి సెట్‌లో వాంగ్ జీ యీపై పూర్తి డామినేషన్ చూపించిన పీవీ సింధు, రెండో రౌండ్‌లో చైనా ప్లేయర్ జోరుకి కాస్త వెనకడుగు వేసింది. అయితే మూడో సెట్‌లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగిన పీవీ సింధు… మొట్టమొదటిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచింది 13 వరుస పాయింట్లను గెలుచుకోవడంతో పాటు ప్రారంభ గేమ్‌ను ముగించడానికి సింధుకు కేవలం 12 నిమిషాలే పట్టింది. అయితే వాంగ్ ఝీ రెండో గేమ్‌ను సాధించడంతో సమం చేసేందుకు అద్భుతమైన రీతిలో పోరాడింది. దీంతో చైనీస్ ప్లేయర్‌కు ఓటమి తప్పలేదు.

ఈ ఏడాదిలో ఇప్ప‌టికే రెండు టైటిళ్లు నెగ్గిన పీవీ సింధు.. తాజాగా సింగ‌పూర్ ఓపెన్ టైటిల్‌తో క‌లిపి మొత్తం మూడు టైటిళ్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్‌లలో గెలిచిన తర్వాత 2022లో మూడవ టైటిల్‌ను కైవసం చేసుకుని, రికార్డ్ నెలకొల్పింది. మొన్న క్వార్ట‌ర్స్ చేరిన సింధు… సెమీస్‌ను కూడా ఈజీగానే గెలిచింది. అయితే ఫైన‌ల్ మ్యాచ్‌లో తొలి సెట్‌ను అల‌వోక‌గా గెలిచిన సింధు.. రెండో సెట్‌లో అనూహ్యంగా ఓట‌మిపాలైంది. మ్యాచ్ ఫ‌లితాన్ని నిర్దేశించే మూడో సెట్‌లో తిరిగి శ‌క్తిని కూడ‌దీసుకున్న సింధు… త‌న ప్ర‌త్య‌ర్థి ఏమాత్రం కోలుకోకుండా మెరుపు దాడి చేసింది.