సింగపూర్ పీఠంపై మనోడు... - MicTv.in - Telugu News
mictv telugu

సింగపూర్ పీఠంపై మనోడు…

September 1, 2017

సంపన్న దేశం సింగపూర్ తాత్కాలిక అధ్యక్షుడిగా భారత సంతతి నేత జే వై పిళ్లై ఎన్నికయ్యారు. ఈ నెల 23 దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. టోనీ టాన్‌ కెంగ్‌ యమ్‌ ఆరేళ్ల అధ్యక్ష పదవీకాలం గురువారం ముగిసింది. దీంతో ఎన్నికలు జరిగే వరకు పిళ్లై దేశాధినేత బాధ్యతలు నిర్వహిస్తారు. కౌన్సిల్‌ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ అడ్వైజర్స్‌ (సీపీఏ)కు ఛైర్మన్‌గా పిళ్లై వ్యవహరిస్తున్నారు.

భారత సంతతి ప్రజలు.. ముఖ్యంగా తమిళులు పెద్ద సంఖ్యలో ఉన్న సింగపూర్‌లో అధ్యక్ష స్థానానికి ఖాళీ ఏర్పడటం ఇదే తొలిసారి.  టామ్ కెంగ్ ఇటీవల విదేశాలకు వెళ్లినప్పుడు కూడా కూడా పిళ్లై తాత్కాలిక దేశాధ్యక్షుడిగా పనిచేశారు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో మలై సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు బరిలో ఉన్నారు. 1934లో మలేసియాలో జన్మించిన పిళ్లై.. సింగపూర్ అభివృద్ధికి ఎంతో దోహదం చేశారు. పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్నత పదవులు అలంకరించిన ఆయన సింగపూర్ ఎయిర్ లైన్స్ అభివృద్ధికి బాటలు పరిచారు.