సింగపూర్‌లో పూజారి అరెస్ట్.. దొంగతనం చేశాడని - MicTv.in - Telugu News
mictv telugu

సింగపూర్‌లో పూజారి అరెస్ట్.. దొంగతనం చేశాడని

August 2, 2020

Singapore Police Arrested Hindu Temple Priest.

సింగపూర్‌లోని ఓ హిందూ ఆలయ పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆలయంలో బంగారు ఆభ‌ర‌ణాలు దొంగతనం చేశాడనే ఆరోపణలతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆలయ సేవకుడిగా ఉంటూ నమ్మకాన్ని వమ్ముచేశాడనే ఆరోప‌ణ‌ల‌తో అతనిపై ఆలయ నిర్వాహకులు కేసు పెట్టారు. అరెస్టు తర్వాత అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇంకా దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు.  

సింగపూర్‌లోని అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీ మరియమ్మన్ ఆలయం బంగారు ఆభరణాలను  గర్భగుడిలో ప్రధాన పూజారి అధీనంలో ఉంచుతారు. ప్రతిరోజూ వాటిని భౌతికంగా లెక్కించేలా రెగ్యులర్ ఆడిట్ చేస్తారు. ఆ సమయంలో కొన్ని బంగారు ఆభ‌ర‌ణాలు క‌నిపించ‌లేదు. దీంతో అనుమానం వచ్చిన నిర్వాహకులు ప్రధాన పూజారిని ప్రశ్నించారు. త‌ర్వాత కొంతసేపటికి అతడు ఆభ‌ర‌ణాల‌ను తెచ్చి ఇచ్చారు. దీంతో అతనిపై  నమ్మక ద్రోహం కేసు పెట్టారు. ఈ విషయంలో ప్ర‌ధాన పూజారి నిందితుడని అనుమానించి  పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు.