లాక్‌డౌన్ లాక్‌డౌనే, పని పనే. సింగపూర్ సుప్రీం కోర్టు జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓ దోషికి మరణశిక్ష వేసింది. డ్రగ్స్ కేసులో దోషిగా తేలిన పునితాన్ జెనాసన్(37) అనే మలేసియా జాతీయుణ్ని ఉరితీయాలని ఆదేశించింది. సింగపూర్ దేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉరివేయడం ఇదే తొలిసారి. పునితాన్ 2011లో హెరాయిన్ డ్రగ్‌ను స్మగ్లింగ్ చేశాడు. అప్పట్నుంచి కేసు నడుస్తోంది.
లాక్‌డౌన్‌లో కొలిక్కి వచ్చింది. అయితే భౌతిక దూరం నిబంధనల కింద కోర్టులు పనిచేయడం లేదు. సింగపూర్ కేసులు అసలే స్ట్రిక్ట్, చిన్నపాటి నేరాలనే గోరంతలుగా చూపి ప్రాణాలు తీస్తాయి. నిబంధనల ప్రకారం కీలక కేసులను జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా విచారించి తీర్పులు ప్రకటిస్తున్నారు. పునితాన్ న్యాయావాది, ప్రభుత్వా న్యాయవాది యాప్ ద్వారా వాదనలు వినిపించారు. డిజిటల్ మాధ్యమంలో డాక్యుమెంట్లను కూడా పంపారు. కేసును విచారించిన జడ్డి ఉరిశిక్ష పడేశారు. అయితే దోషిని నేరుగా విచారించకుండా తీర్పివ్వడం పూర్తిగా అన్యాయమని పునితాన్ న్యాయవాది ఆక్రోశం వ్యక్తం చేశాడు. దీనిపై అప్పీలు చేస్తానన్నాడు. సింగపూర్‌లో జూన్ 1వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది.