450 రోజులుగా కోళ్లనే తినేస్తున్నాడు.. ఏమైపోతాడో! - MicTv.in - Telugu News
mictv telugu

450 రోజులుగా కోళ్లనే తినేస్తున్నాడు.. ఏమైపోతాడో!

March 16, 2019

నచ్చిన వంటకం ఏదైనా వారానికి రెండు, మూడు తింటుంటాం. ఇంకా ఎక్కువసార్లు తింటే.. దానిపై ఇష్టం కాస్తా పోయి, విరక్తి పుడుతుంది. కానీ సింగపూర్‌కు చెందిన ఓ యువకుడు మాత్రం తనకు ఎంతో ఇష్టమైన చికెన్ రైస్‌ను ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 450 రోజులుగా తింటున్నాడు. ఉద్యమంలా ఆయన తింటున్న వంటకాలను చూసి అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. చికెన్.. చికెన్.. చికెన్.. మరో మాట లేదంతే. ఉడికించిన చికెన్, కాల్చిన చికెన్.. చికెన్ పికెల్.. చికెన్ టిక్కా వంటి వాటిని అన్నంతో కలిపి తీసుకుంటున్నాడు.

Singaporean Man Is Obsessed With Chicken Rice & Has Been Eating Just That For 450 Days.

ఇన్‌స్టా‌గ్రామ్‌లో ‘జి ఫాన్ ఫాన్’ అనే వ్యక్తి  రోజుకో చికెన్ వంటకాన్ని తింటున్నాడు. 2017 సెప్టెంబర్ నుంచి రోజుకో రకమైన చికెన్ తింటూ ‘Everyday’ హ్యాష్ ట్యాగ్‌తో రోజుల సంఖ్యను పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా ఇప్పటి వరకు 450 రోజులు పూర్తయ్యింది. ఇలా అతను చికెన్ తినడానికి ఏదైనా కారణం ఉందా? లేక ఇష్టంతోనే తింటున్నాడా అనేది మాత్రం ‘జి ఫాన్ ఫాన్’ చెప్పలేదు. ఇన్ని రోజుల నుంచి అతడు చికెట్ తింటుంటే అతని ఆరోగ్యం ఎలా ఉందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఇందుకు సంబంధించిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.