సింగరేణిలో ఎన్నికల సైరన్ - MicTv.in - Telugu News
mictv telugu

సింగరేణిలో ఎన్నికల సైరన్

August 21, 2017

సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఎన్నికల నగారా మోగింది. గుర్తింపు సంఘం ఎన్నికలను ఎప్పుడు నిర్వహిచాలన్నదానిపై  సోమవారం సింగరేణి అధికారులు హైదరాబాద్ లో చర్చించారు. అక్టోబర్ 5న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని  తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్యాంసుందర్, సింగరేణి డైరెక్టర్ పవిత్రన్ కుమార్, కార్మిక నేతలు పాల్గొన్నారు.

ఎన్నికల షెడ్యూల్..

నామినేషన్ల స్వీకరణ సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్16 వరకు కొనసాగుతుంది.  నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు సెప్టెంబర్ 19. నామినేషన్లను 20వ తేదీన పరిశీలిస్తారు. అక్టోబర్ 5న ఎన్నికలు జరిపి అదే రోజు రాత్రి  ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.