Home > విద్య & ఉద్యోగాలు > ముగిసిన సింగరేణి పరీక్ష..నేడు తుది 'కీ' విడుదల

ముగిసిన సింగరేణి పరీక్ష..నేడు తుది 'కీ' విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే సింగరేణిలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి ఆదివారం రాత పరీక్షకు జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 77,907 (79%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. ఈరోజు https://scclmines.comలో 'కీ'ని విడుదల చేస్తామని ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

"ఇటీవలే సింగరేణిలో విడుదలైన 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం జరిగిన రాత పరీక్ష సజావుగా ముగిసింది. పరీక్షకు 77,907 (79%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాల వారీగా.. మంచిర్యాలలో 88,62శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 87.31శాతం, వరంగల్‌లో 84.6శాతం, కరీంనగర్‌లో 82.09శాతం, ఖమ్మంలో 81.35శాతం, హైదరాబాద్‌లో 68.28శాతం, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 64.42శాతం మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన తుది 'కీ' ని సోమవారం విడుదల చేస్తాం. అభ్యర్థులు 'కీ'ని https://scclmines.comను సందర్శించండి. అభ్యంతరాలుంటే ఈ నెల 7న ఉదయం 11 గంటలలోపు వెబ్‌సైట్ ద్వారా తెలియజేయండి" అని సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) ఎస్ చంద్రశేఖర్ తెలిపారు.

గోవాలో ప్రశ్నపత్రం లీక్ చేసి, కొందరికి రాత పరీక్ష నిర్వహించారన్న ప్రచారంపై అధికారులు వివరణ ఇచ్చారు. అదంతా అవాస్తవం, దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటివి ఏమీ జరగలేదని తెలిపారు. ప్రశ్నపత్రం లీక్‌పై ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే 9491145075 నంబరుకు ఫోన్ గానీ, సంస్థకు ఈమెయిల్ చేసినా విచారణ జరుపుతామని అధికారులు పేర్కొన్నారు.

Updated : 4 Sep 2022 9:15 PM GMT
Tags:    
Next Story
Share it
Top