సింగరేణి లాభం రూ. 395 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

సింగరేణి లాభం రూ. 395 కోట్లు

August 19, 2017

సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 395 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.  ఈ గడువులో మొత్తం రూ. 17,853 కోట్ల టర్నోవర్ సాధించింది. శనివారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో సంస్థ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల కింద కంపెనీ రూ. 6,056 కోట్లు చెల్లించింది. కేంద్రానికి రూ. 2,888 కోట్లు, తెలంగాణ ప్రభుత్వానికి రూ. 3,168 కోట్లు చెల్లించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ. 30 కోట్లు చెల్లింపునకు బోర్డు ఆమోదం తెలిపింది. సింగరేణిలో మూడు కొత్త గనులకు సంబంధించిన ఆర్థిక అంచనాలకు కూడా ఆమోదం తెలిపింది. సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధరన్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఇంధన కార్యరర్శి అజయ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.