Singareni Sccl Jobs 2022 Apply For 1300 Apprentice Jobs
mictv telugu

సింగరేణిలో 1300 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

July 25, 2022

సింగరేణి మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సింగరేణిలో 1300 అప్రెంటిస్ షిప్ లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జీఎం బీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈరోజు నుంచి (జూలై 25) సంస్థ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీలను వచ్చే నెల 8 (ఆగస్టు 8)వ తేదీలోగా ఎంవీటీల్లో సమర్పించాలన్నారు. మొత్తం 1300 మందికి ఈ అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వారసత్వ ఉద్యోగాలకు అర్హులైన వారికి, సంస్థ కుటుంబాలకు చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.

అభ్యర్థులు ప్రభుత్వ NAPS కొత్త పోర్టల్ www.apprenticeshipindia.org లో తమ పేర్లను నమోదు చేసుకున్న తర్వాత www.scclmines.com/apprenticeship వద్ద SCCL వెబ్ పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. ఎంప్లాయీస్ చిల్డ్రన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు (SCCLలో చేరడానికి ముందు ITI సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు లేదా కంపెనీలో పనిచేసి ఎన్ఓసీ తీసుకున్నవారు) దరఖాస్తును సంబంధిత డిపార్ట్‌మెంట్ హెచ్ ఓడీల ద్వారా పంపాలి.దరఖాస్తును సంబంధిత ఏరియా ఎస్టేట్స్ HOD ద్వారా సంబంధిత ఏరియా MVTCకి పంపాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా అతని/ఆమె స్వంతంగా స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటో మరియు సంతకాన్ని jpg ఫార్మాట్‌లో గరిష్టంగా 50KB పరిమాణంతో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

అప్లోడ్ చేసిన డాక్యుమెంట్‌లు ఒరిజినల్ సర్టిఫికెట్‌లను కలర్ పిడిఎఫ్ పార్మాట్ లో మాత్రమే మార్చాలి. ఉమ్మడి నాలుగు జిల్లాల (ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్) అభ్యర్థులను 95 శాతం.. మిగతా 5 శాతం నాన్ లోకల్ అభ్యర్థులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్ కొరకు ఈ లింక్ కాపీ చేసుకొని గూగుల్ లో సెర్చ్ చేయండి. https://scclmines.com/apprenticeship/docs/202202_Circular_Annexures.pdf..ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేయగలరు.