Singer Alfaz Singh is undergoing treatment in the hospital
mictv telugu

పంజాబ్‌లో మరో సింగర్‌పై హత్యాయత్నం.. హనీసింగ్ ఆవేదన

October 3, 2022

పంజాబ్‌లో మరో సింగర్‌పై హత్యాయత్నం జరిగింది. ఇటీవల సింగర్ సిద్ధు మూసేవాలా హత్య ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం పరిశ్రమలో కలకలం రేపుతోంది. పాపులర్ సింగర్ అల్ఫాజ్ సింగ్ అలియాస్ అమన్ జోత్ సింగ్ పన్వర్‌పై శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు యోయో హనీసింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

ఐసీయూలో అల్ఫాజ్ బెడ్ మీద ఉండి చికిత్స తీసుకుంటున్న ఫోటో షేర్ చేశాడు. తలకు, చేతికి బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వివరించాడు. గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారని, వారెవరో ఇంకా తేలాల్సి ఉందని పేర్కొన్నాడు. అతడి ఆరోగ్యం విషమంగా ఉందని, దయచేసి కోలుకునేలా అందరూ ప్రార్ధించాలని హనీసింగ్ విజ్ఞప్తి చేశాడు. కాగా, పంజాబ్‌లో గాయకులపై వరుసగా దాడుల జరగడం మిస్టరీగా మారింది. ఎందుకు, ఎవరకు దాడి చేస్తున్నారో అంతు చిక్కడం లేదని పలువురు వాపోతున్నారు. దీంతో మిగతా గాయకులు భయాందోళనకు గురవుతున్నారు.