‘అమ్మాయిల్ని గ్యాంగ్ రేప్ చేద్దాం’ అంటూ సాగిన బాయిస్ లాకర్ రూం చాట్ కేసులో అమ్మాయి పాత్ర ఉందని బయటికి రావడంతో దుమారం రేగుతోంది. అమ్మాయిల కూడా ముదుర్లుగా తయారయ్యారని, నేరం ఎవరు చేసిన నేరమేని అంటున్నారు. ‘నేరం చేసింది ఆడామగా అని చూడకూడదు, నేరం చేసిన వ్యక్తిని కఠినాం శిక్షించాలి’ అని అంటున్నారు. దీనిపై గాయని చిన్మయి నిప్పుల వర్షం కురిపించింది. దర్యాప్తులో నిజం బయటికొస్తుదని, అంతవరకు వేచిచూడాలని కోరింది. సమాజంలో ఎవరు అత్యాచారాలకు గురవుతున్నారు? ఎవరు ఎవర్ని రాచి రంపాన పెడుతున్నారు అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నలం వర్షం కురిపించింది.
‘1. ప్రతీకారం కోసం ఎవరి న్యూడ్ ఫొటోలు వాడుతున్నారు?
- కట్నం కవాలని ఎవరిని అడుగుతున్నారు?
3.పుట్టగానే ఎవర్ని చంపేస్తున్నారు?
- మీ చెల్లెలు, కూతురు ఇంటికి రాకపోతే ఆందోళన పడతారు కదా? ఏం, ఆడోళ్లు వాళ్లను రేప్ చేస్తారని భయమా?
- కెరీర్, చదువులు పాడవుతాయని అత్యాచారాల గురించి దాచిపెడుతోంది ఎవరు?
- మద్యం తాగి, జీవిత భాగస్వాములను హింసిస్తున్నది ఎవరు? కర్రపెత్తనం చేస్తున్నది ఎవరు’
ఆని చిన్మయి నిలదీసింది. అత్యాచారాలపై అమ్మాయిలు పెదవి విప్పాలని కోరింది. తమళ సినీ దర్శకుడు వైరముత్తు తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపిండం, స్త్రీ సమస్యలపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుడడం తెలిసిందే.