ఈసారి కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తా.. చిన్మయి - MicTv.in - Telugu News
mictv telugu

ఈసారి కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తా.. చిన్మయి

April 13, 2019

కొద్ది రోజులుగా ప్రముఖ గాయని వార్తల్లొకెక్కుతున్న విషయం తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా పదేళ్ల క్రితం సీనియర్ గీత రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించింది. దీన్ని వైరముత్తు ఖండించారు కూడా.  లైంగికంగా వేధించిన విషయం పదేళ్ల తర్వాత నీకిప్పుడు గుర్తొచ్చిందా? అని మరికొందరు ఆమెను ప్రశ్నించారు. అలా అప్పటి నుంచి తరచూ చిన్మయి వార్తల్లో నిలుస్తోంది.

Singer Chinmayi Sensational Comments On Writer Vairamuthu

తాజాగా ఈ విషయమై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు చిన్మయి సమాధానమిస్తూ.. ‘ఈసారి వైరముత్తు కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తా’ అని మండిపడింది.. అయితే చిన్మయి ఇలా అనడానికి చేయడానికి మరో కారణం ఉంది. ఇటీవల బెంగళూరులో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి నేత రిజ్వాన్ అర్షద్ నిర్వహించిన ర్యాలీకి ఖుష్భూ మద్ధతు పలికారు. ఈ ర్యాలీ‌లో ఓ వ్యక్తి ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. దీంతో ఖుష్భూ అతని  చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చిన్మియితో చాట్ చేసిన ఓ నెటిజన్ ఈ ప్రస్తావన తీసుకురాగా.. ‘వైరముత్తు కనిపిస్తే ఈ సారి ఖచ్చితంగా చెంప చెళ్లుమనిపిస్తా. అప్పుడే నాకు న్యాయం జరుగుతుంది’ అని చిన్మయి పేర్కొంది. దీంతో ఈ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.