Singer Chinmayi Serious On Bigg Boss Fame Shrihan
mictv telugu

సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ పిచ్చి చేష్టలు.. బెల్టుతో బాదుకుంటూ చిన్నారికి బెదిరింపులు..!

January 9, 2023

Singer Chinmayi Serious On Bigg Boss Fame Shrihan

ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ టాలీవుడ్ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ప్రత్యక్షం అవుతుంటారు. క్యాస్టింగ్ కౌచ్ బాధితులకి మద్దతుగా పెద్ద ఎత్తున మీటూ ఉద్యమాన్ని ఉరకలు పెట్టించిన చిన్మయి సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అంటారు. అలాంటి చిన్మయి తాజాగా యూట్యూబర్, బిగ్ బాస్ ఫెమ్ సిరి లవర్ శ్రీహన్ చేసిన ఒక వింత పనిపై మండిపడింది.

తాజాగా బిగ్ బాస్ 6లో పాల్గొని.. విన్నర్ అవ్వాల్సిన అవకాశం వచ్చినా.. 40లక్షలు తీసుకుని రన్నర్ అయ్యాడు శ్రీహన్. అయితే డబ్బుతో పాటు పాపులారిటీ కూడా బాగానే తెచ్చుకున్న శ్రీహన్, సిరిల జంట ఎప్పటి నుండో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్. అయితే వీరిద్దరూ ఒక అబ్బాయిని పెంచుకుంటున్నారు. పిల్లాడి పేరు చైతు. మాట వినకుండా అల్లరి చేస్తున్న కొడుకుని బెదిరించడం కోసం.. శ్రీహాన్‌.. బెల్ట్‌తో తనను తాను కొట్టుకుంటున్నట్లుగా నటించాడు. ఎన్నిసార్లు చెప్పాలి.. నామాట వింటావా.. లేదా అని అరుస్తూ.. బెల్ట్‌తో కొట్టుకుంటున్నట్లు యాక్ట్‌ చేస్తాడు.

అప్పుడు చైతూ.. నీ మాట వింటా డాడీ.. కొట్టుకోవద్దు.. సారీ అంటూ ఏడుస్తాడు. ఈ మొత్తం సీన్‌ని సిరి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అది కాస్తా వైరల్ అవ్వగా.. వీడియో చూసిన సింగర్ చిన్మయి మండిపడింది. ‘తల్లిదండ్రుల స్వీయ హాని పిల్లల మనస్సుపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. చాలా మంది భారతీయ తల్లిదండ్రులు తమను తాము కొట్టుకుంటూ పిల్లలని బెదిరించి, బ్లాక్ మెయిల్ చేయటం వంటి ధోరణిని మార్చుకోవాలి. తమ పిల్లలు తాము చెప్పినట్లు చేయకున్నా.. తెచ్చిన సంబంధం చేసుకోకున్నా చచ్చిపోతాం అని బెదిరించటం వంటివి మానుకోవాలి. ఈ ధోరణికి.. కనీసం ఈ జనరేషన్‌లో అయినా ముగింపు పలకాలి’’ అంటూ పోస్ట్‌ చేసింది. దీనిపై నెటిజనులు.. భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళేదో సరదాగా వీడియో చేసుకుంటే నీ బాధ ఏంటీ అంటూ కొందరు అంటుంటే.. పిల్లలని అలా బ్లాక్ మెయిల్ చేయటం కరెక్ట్ కాదని మరికొందరు చిన్మయికి సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు.