Singer Chinmayi Sripaada feeding milk twins
mictv telugu

పాలిస్తూచిన్మయి తన్మయం.. ఫోటో వైరల్

October 18, 2022

ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద పేరు సౌత్‌లో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ‘మీటూ’ ఉద్యమంలో సెలబ్రెటీలపై సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచింది చిన్మయి. తమిళ ఐకానిక్ రైటర్ వైరముత్తు బండారం బయటపెట్టింది. చిన్నతనంలోనే తనపై లైంగిక వేధింపులకి పాల్పడేవాడని అతనితో పోరాటానికి దిగింది. ఇక స్టార్ సింగర్ కార్తీక్ అసలు రూపం కూడా బయటపెట్టింది. తన దగ్గరికి వచ్చే అమ్మాయిలను కార్తీక్ ఎలా వాడుకుంటాడో బయటి ప్రపంచానికి చెప్పింది. దక్షిణ భారతదేశంలో మీటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిరేలా చేసి అమ్మాయిలకు రోల్ మోడల్‌లా నిలిచింది. దాంతో మొగాళ్ళచే వేధింపులకు గురవుతున్న మహిళలు అందరు సోషల్ మీడియాలో చిన్మయితో బాధలు చెప్పుకుంటారు కూడా. అయితే వాళ్ళ కష్టాలకి సహాయంగా చిన్మయి నిలబడి మహిళా లోకానికి గొప్పగా కనిపించినా.. తమిళ ఇండస్ట్రీ పెద్దలకి మాత్రం విలన్ అయిపోయింది చిన్మయి. దాంతో ఒక వర్గం ఆమెపై నెగిటివ్ ట్రోల్స్ కూడా చేస్తుంటారు.

ఆ ట్రోలింగ్‌కి ఎక్కడ బెదరకుండా సోషల్ మీడియాలో అందరికి గట్టిగా బుద్ధి చెప్తుంది చిన్మయి. ఇక ఇవ‌న్నీ ఒక వైపు అయితే, మ‌రో వైపు ఆమె న‌టుడు, డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. జూలై 22న కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో చిన్మయి, రాహుల్ ఇద్దరూ సంబరపడిపోయారు. ద్రిప్తా, శర్వాస్ అనే పేర్లు పెట్టేశారు. అయితే ఇప్పుడు చిన్మయి తన పిల్లలకు పాలు ఇస్తూ ఆనందంలో మునిగిపోతోంది. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్నట్టుగా కనిపిస్తోంది. త‌న క‌వ‌ల‌ల‌కు పాలిచ్చే ఫొటోను ఆమె షేర్ చేసింది. ‘‘క‌వ‌ల‌ల‌కు పాలు ఇలా ఇస్తున్నా.. ప్రపంచంలో ఇదే అత్యుత్త‌మం. ఇదొక బాధ్యతగా అనిపిస్తుంది.. అయినా బావుంది’’అంటూ మెసేజ్ కూడా షేర్ చేశారు. దీనిపై సెల‌బ్రిటీలు, ఆమె ఫాలోవ‌ర్స్ అంద‌రూ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.