Singer Daler Mehndi sentenced to two years in jail
mictv telugu

సింగర్ దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు శిక్ష

July 14, 2022

ప్రసిద్ధ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి పాటియాలా కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 15 ఏళ్ల కింద నమోదైన మానవ అక్రమ రవాణా కేసులో కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. ఆయనతో పాటు ఆయన సోదరుడు శంషేర్ సింగ్‌కు వ్యతిరేకంగా 2003 లో మొత్తం 31 కేసులు నమోదయ్యాయి. కాగా, దలేర్ కోర్టును క్షమాపణ కోరినా కోర్టు అంగీకరించలేదు. దీంతో పోలీసులు దలేర్ మెహందీని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈయన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతమందించిన చిత్రాలలో పలు పాటలు పాడారు. రాజమౌళి తీసిన యమదొంగ సినిమాలో రబ్బరు గాజులు, బాహుబలి టైటిల్ ట్రాక్, ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్‌షా చిత్రంలో బంతిపూల జానకి వంటి హిట్ పాటలు పాడారు.